ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 19,241 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 335 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,713కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 936 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,94,818 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 6,754 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,285కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,29,77,640 నిర్థారణ పరీక్షలు చేశారు. 










దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వచ్చింది. కొత్తగా 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. 673 మంది మృతి చెందారు. 48,847 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,24,187కు చేరింది. మొత్తం రికవరీల సంఖ్య 4,20,86,383కు పెరిగింది. మరణాల సంఖ్య 5,11,903 వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.27%గా ఉంది.


వ్యాక్సినేషన్


దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. కొత్తగా 30,81,336 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,37,22,697కు చేరింది.


ఆంక్షలు సడలింపు


దేశంలో రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుతున్నందున రాష్ట్రాలు ఆంక్షలు సడలించాలని ఇటీవల కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. శనివారం 22,270 కరోనా కేసులు నమోదయ్యాయి.