ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటలలో 23,824 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 150 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు బలయ్యారు. దీంతో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,391కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 217 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,49,555 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3,760 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,706కి చేరింది. వీరిలో 20,49,555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 217 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,391కు చేరింది. 


Also Read: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ


దేశంలో కరోనా కేసులు


భారత్‌లో తాజాగా 12,729 కరోనా కేసులను గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒకేరోజులో దేశంలో 221 మంది కరోనా సోకడం వల్ల మరణించినట్లుగా వివరించారు. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,333,754 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,59,873 కి ఎగబాకింది. ఇక ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 1,48,922గా ఉందని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. యాక్టివ్ కేసులు గత 253 రోజులతో పోలిస్తే అతి తక్కువగా నమోదయ్యాయని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అన్ని కేసుల్లో ఒకశాతం కూడా ప్రస్తుత యాక్టివ్ కరోనా కేసులు లేవని వివరించారు. ప్రస్తుతం 0.43 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇది గతేడాది మార్చి నుంచి అతి తక్కువ అని పేర్కొన్నారు.


Also Read: ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ! దీపావళి టపాసులే కారణమా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి