ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 30,717 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 176 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,495కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 103 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,599 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1227 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,321కి చేరింది. గడచిన 24 గంటల్లో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,495కు చేరింది. 


Also Read: 10 మంది మంత్రులు ..50 మంది ఎమ్మెల్యేలకు కరోనా ! అసెంబ్లీ సమావేశాల్లోనే అంటుకుందా ?


దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22,775 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో మరో 406 మంది మరణించారు. తాజాగా కోవిడ్ నుంచి 8,949 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,431కు చేరింది. భారత్ లో టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం 58,11,487 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,45,16,24,150 కు చేరింది.


Also Read: దేశంలో ఆగని ఒమిక్రాన్‌ విజృంభణ.. భయపెడుతున్న మహారాష్ట్ర పరిస్థితులు 



  • మొత్తం కరోనా కేసులు: 3,48,61,579

  • మొత్తం మరణాలు: 4,81,486

  • కోవిడ్ యాక్టివ్ కేసులు: 1,04,781

  • కరోనా నుంచి కోలుకున్నవారు: 3,42,75,312


Also Read: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి