ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,882 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 4,108 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,510కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 696 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,696 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 30182 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. గడిచిన 24 గంటల్లో 696 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 30182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,510కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,18,84,914 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం... తరగతుల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు కీలక వ్యాఖ్యలు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త శాంతించాయి. నిన్నటితో పోల్చితే 13,113 పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. గత రెండు వారాలుగా ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయే, తప్ప తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,58,089 (2 లక్షల 58 వేల 89) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 385 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
నిన్న ఒక్కరోజులో 1,51,740 (ఒక లక్షా 51 వేల 740) మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగింది. క్రితం రోజు కేసులను పరిశీలిస్తే నేడు మూడు లక్షలు దాటేలా కనిపించాయి. అనూహ్యంగా నిన్నటి కన్నా 13 వేల కేసులు తక్కువగా నిర్దారణ అయ్యాయి.
- రోజువారీ పాజిటివిటీ రేటు: 119.65%
- దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 16,56,341
- భారత్‌లో రికవరీ రేటు: 96.62 శాతం
Also Read: ఆధార్ లో తప్పు ఆధారం లేకుండా చేసింది... అనంతపురంలో ఓ వృద్ధుడి దీనపరిస్థితి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి