APTF Protests:  సోమవారం (డిసెంబర్ 26) రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏపీ టీచర్చ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఫెడరేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు నిరసనలకు వెళ్లకుండా పోలీసులు ఇప్పటి నుంచే వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెబుతున్నారు. 


20 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలి..


"ప్రధానంగా ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ సంబంధించిన ఆర్థిక సమస్యలు ఆర్థిక పరంగా నేడు ఉపాధ్యాయులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలి. పెండింగ్ బకాయిలు దాదాపుగా 20 కోట్లు.. గతంలో, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉన్న బకాయిలు పేరుకు పోతున్నాయి. ఆ బకాయిలన్నింటిని కూడా తక్షణమే చెల్లించాలనే ప్రధాన నిర్ణయంతో అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది." - ఏపీ టీచర్స్ పెడరేషన్ సభ్యులు


సుమారు 17 వందల కోట్లు పెండింగ్ లో..


"ముఖ్యంగా ఆర్థిక అంశాలు ఏపీజేఐ, పీఎఫ్ ఇలాంటివన్నీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం. పెట్టుకున్నా కూడా, దాచుకున్న అమౌంట్ కూడా మేం తీసుకోవడానికి వీలు లేకుండా పోతోంది. సుమారుగా ఒక సంవత్సరం నుంచి పెట్టిన అప్లికేషన్స్ అన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి. సీపీఎస్ ఉద్యోగుల విషయంలో కూడా పెండింగ్ బకాయిలు చాలా ఉండిపోయాయి. సుమారుగా 17 వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మాకు రావాల్సిన 3 వేల కోట్ల నగదు కూడా పెండింగ్ లోనే ఉంది. మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి." - ఏపీ టీచర్స్ పెడరేషన్ సభ్యులు


శాంతి యుతంగానే ఆందోళనలు నిర్వహిస్తాం..


"ఎలాంటి ధర్నాలకు పిలుపునిచ్చినా పోలీసులు చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. దాన్ని మేం ఖండిస్తున్నాం. మేం ధర్నాను శాంతియుతంగానే చేస్తాం. దాని వల్ల శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గదు. కాబట్టి మేము పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నాం. శాంతియుతంగానే ధర్నాలు చేస్తాం. ప్రధానంగా పది డిమాండ్లు పెట్టాం. ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు, అట్లాగే సీపీఎస్ రద్దు అట్లాగే ప్రస్తుతం జరుగుతున్న టీచర్స్ ట్రాన్స్ ఫర్స్ చాలా సమస్యలు ఉన్నాయి." - ఏపీ టీచర్స్ పెడరేషన్ సభ్యులు


టీచర్లకు గుదిండబల్లా యాప్‌లు !
 
ఉపాధ్యాయులకు బోధనేతర పనులను మినహాయింపు పేరిట ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో యాప్‌లనూ చేర్చాలన్న డిమాండ్‌ను టీచర్లు చేస్తున్నారు.  తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న యాప్‌లను కొనసాగించవద్దని కోరుతున్నాు. పాఠశాల విద్యలో ఉన్న యాప్‌లు ఏ శాఖలోనూ లేవు. బడికెళ్లగానే ముఖ ఆధారిత హాజరు నుండి విద్యార్థుల హాజరు, మానిటరింగ్‌, మధ్యాహ్నం భోజనం, నాడు-నేడు పనులు, కోడిగుడ్ల సైజులు చూసుకోవడం, బియ్యం లెక్కలు, మరుగుదొడ్లు ఫోటోలు తీయడం, విద్యా కానుక కిట్ల పంపిణీ వంటి పనులను అప్పగించింది. వీటికోసం 32 రకాల యాప్‌లను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఇందులో 16 యాప్‌లలో ప్రతి రోజూ ఉపాధ్యాయుడు నమోదు చేయాలి. సర్వర్లు, నెట్‌వర్క్‌ సమస్య వల్ల యాప్‌లో సమాచారం నమోదు చేయని వారికి కూడా విద్యాశాఖ షోకాజ్‌ నోటీసు ఇస్తోంది. దీంతో బోధన కంటే యాప్‌లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.