ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చని ఆయన అన్నారు. ఇళ్లలో కరెంట్‌ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-8 గంటల మధ్య విద్యుత్‌ వాడకం తగ్గించుకోవాలన్నారు. బొగ్గు కొరత, ధర పెరగడం వల్ల కరెంట్ సంక్షోభం వచ్చిందని సజ్జల తెలిపారు. విద్యుత్ సంక్షోభంపై సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారన్నారు. 


Also Read:  ఆ అర్చకులకు సంభావన ఇవ్వడంలేదు... గర్భగుడిలో పూజలు చేయనీయడంలేదు... సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్






కోర్టులపై నమ్మకం ఉంది


పేదలందరికీ ఇళ్ల పథకంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ తీర్పు ఎంతోమంది లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారన్నారు. తాడేపల్లిలో సోమవారం మాట్లాడిన సజ్జల.. పిటిషన్‌ వేసిన వారిలో కొంతమందికి పిటిషన్‌తో సంబంధంలేదన్నారు. ఈ పిటిషన్ల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ శక్తులు తెరవెనక ఉన్నట్లు ఆరోపించారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Also Read: ఇక డైరక్ట్ రాజకీయాల్లోకి జంప్! ‘మంచు మార్క్’ పాలిటిక్స్ ఖాయమేనా?






టిడ్కో ఇళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణం


ఏపీలో ఇల్లు లేని వారు 31 లక్షల మంది ఉన్నారని సజ్జల అన్నారు. ఈ ఇళ్ల పథకం కింద తొలిదశలో 15 లక్షల నిర్మాణాలు చేపట్టామన్నారు. మహిళల పేరిట ఓనర్ షిప్ ఇవ్వడం అనేది సీఎం జగన్ పాదయాత్రలో తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.  ఈ ఇళ్లు పేదలకు ఆస్తిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆధునిక టౌన్ షిష్‌లు తయారు చేయడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్ని వసతులతో ఆ కాలనీలను తయారు చేస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. ఎన్‌బీసీ స్టాండర్డ్స్‌ ప్రకారమే స్థలం కేటాయింపు నిర్ణయించామన్నారు. చాలా రాష్ట్రాల కన్నా ఎన్‌సీబీ గైడ్ లైన్స్ మించి తాము ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని సజ్జల తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని నిర్మించిన టిడ్కో ఇల్లు ప్రస్తుత ఇళ్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని సజ్జల అన్నారు. విద్యుత్ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయన్నారు. విద్యుత్ వినియోగం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ఆరోపించినట్లు విద్యుత్ చెల్లింపుల్లో సమస్య లేదన్నారు. రానున్న అయిదారు నెలల్లో ప్రజలు విద్యుత్ ఆదా దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. 


Also Read: ప్రతీ స్కూల్‌కు రూ. లక్ష .. స్కూళ్లు ప్రారంభం కాగానే అమ్మఒడి, విద్యాకానుక ! సీఎం జగన్ కీలక ఆదేశాలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి