Andhra Pradesh All high profile cases are being transferred to AP CID : ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ మరో సారి యాక్టివ్ అవుతోంది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో సీఐడీ సోషల్ మీడియా కేసుల నుంచి ప్రభుత్వ పెద్దలకు అత్యంత ముఖ్యమైన మార్గదర్శి వంటి కేసుల వరకు అన్నింటినీ డీల్ చేసేది. దాదాపుగా అన్ని రాజకీయ పరమైన కేసులే. ఇతర కేసుల విచారణ సాధారణ పోలీసులు తీసుకునే వారు. ఈ కారణంగా అప్పటి సీఐడీ చీఫ్‌లుగా పని చేసిన పీవీ సునీల్ కుమార్ తో పాటు సంజయ్ కు పోస్టింగ్‌లు లేవు. ఇద్దరిపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా అలంటి హై ప్రోఫైల్ కేసులు సీఐడీ వద్దకే వెళ్తున్నాయి.
కీలక కేసులు సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు
వైసీపీ అధికారంలో ఉన్పప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు చంద్రబాబు ఇంటిపైనా దాడి జరిగింది. ఆ కేసులను అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాడి జరిగింది తనపై కాబట్టి టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆదారాలతో అరెస్టులు ప్రారంభించారు. చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ దాడికి వెళ్లిన కేసు కూడా వేగం పుంజుకుంది. తాజాగా హీరోయిన్ జత్వానీ కేసును కూడా సీఐడీకి అప్పగించారు.
ఇప్పటికే మద్యం, ఇసుక స్కాం కేసులు కూడా!
గత ప్రభుత్వ హయాంలో మద్యం , ఇసుకల పై భారీ స్కాం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. సీఐడీ ఈ మేరకు కేసులు పెట్టింది. మైనింగ్ వ్యవహారాలను తన చేతుల మీదుగా నడిపిన వీజీ వెంకటరెడ్డి అనే అధికారిని ్రెస్టు చేశారు. తదుపరి చర్యలు తీసుకోనున్నారు. లిక్కర్ స్కాంలో కీలకమని భావిస్తున్న మరో అధికారి వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నారు. లిక్కర్ స్కామును ఇప్పటికే సీఐడీకి అప్పగిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు . ఇందులో పెద్ద ఎత్తున నగదు అక్రమ చెలామణి జరిగిందని అందుకే ఈడీకి కూడా సిపారసు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
కేసుల్లో సివిల్ సర్వీస్ అధికారులు, రాజకీయ నేతలు
ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తున్న కేసులన్నీ రాజకీయ నేతలు, సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించినవే. వారే ప్రధాన నిందితులుగా ఉన్నారు. కనీసం పది మంది వరకూ సివిల్ సర్వీస్ అధికారులతో పాటు మాజీ సీఎం జగన్ దగ్గర నుంచి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు రాజకీయ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా లాంటి చిన్నా చితకా కేసులు కావు. హై ప్రోఫైల్ కేసులు.. పవర్ ఫుల్ వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అందుకే సాధారణ పోలీస్ స్టేషన్లలో అయితే ఇతర కేసుల విచారణతో బిజీగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేరని అందుకే సీఐడీని ఇన్వాల్వ్ చేస్తున్నారని అనుకోవచ్చు.