Dog Lovers : మనిషికి మనిషికి మధ్య బంధం ఎప్పుడైనా బీటలు వారొచ్చు కానీ అదే మనిషికి.. శునకానికి మధ్య ఒక్క సారి స్నేహం కుదిరిదే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇటీవల చార్లీ అనే సినిమా ఇదే టాపిక్ మీద వచ్చింది. లక్షల మంది జంతు ప్రేమికులతో కంట తడి పెట్టించింది. అలాంటి కథలు అక్కడక్కడా ఉంటాయి. కృష్ణా జిల్లాలో ఉన్న జ్ఞాన ప్రకాశరావు కూడా అలాంటి డాగ్ లవరే.
వైజాగ్ లో రెచ్చిపోతున్న బైక్ రైడర్లు, కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు!
తొమ్మిదేళ్ల పాటు జ్ఞానప్రకాశరావు వెంటే ఉన్న శునకం
9 సంవత్సరాలు పాటు సొంత బిడ్డలా ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం నిర్మించటం కాక 6 ఏళ్ల పాటు మనుషులకు జరిపినట్లు మాదిరిగా ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం కి చెందిన జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయం , పాడి పోషణ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. తనకి ఉన్న ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటున్న జ్ఞానప్రకాశరావు దంపతులు ఓ శునకాన్ని పెంచారు.
విపత్తు బాధిత ప్రాంతాలకు సీఎం జగన్ ఎందుకు వెళ్లరు ? విపక్షాలు విమర్శిస్తున్నా ఎందుకు పట్టించుకోరు ?
తనపై అభిమానం చూపుతున్న శునకాన్ని మర్చిపోలేకపోయిన జ్ఞాన ప్రకాశరావు
రోజు రోజుకు శునకం జ్ఞానప్రకాశరావు ఇద్దరు పై మాగజీవం చూపించే విశ్వాసం మరింత ప్రేమ పెంచుకున్నారు.. జ్ఞానప్రకాశరావు ఏదైనా పనిమీదా బయటకు వెళ్లితే వచ్చే వరకు కనీసం అన్న పానీయాలు ముట్టుకునేది. ప్రకాశరావు తో రోజు వ్యవసాయ పనుల కోసం పొలం పనులకు వెళ్లేది. సొంత కొడుకు లాగ పెరిగిన కుక్క అకస్మాత్తుగా చనిపోయింది. తొమ్మిదేళ్ల పాటు బతికి ఉన్నా.. వయసు మీద పడటంతో చనిపోయిది. దీంతో జ్ఞానప్రకాశరావు విషాదం లో మునిగిపోయారు. కానీ అలా మర్చిపోవాలని అనుకోలేదు.
కేసీఆర్ కాన్వాయ్ విజయవాడలో, గుట్టుచప్పుడు కాకుండా కార్లకు కొత్త ఫిట్టింగ్స్
విగ్రహం చేయించి ప్రతీ ఏడాది సంవత్సరీకాలు
మనషులకు జరిపినట్లు కర్మకాండలు నిర్వహించాడు 200 పైగా బంధువులు ,గ్రామస్తులకు భోజనాలు పెట్టాడు. అమూగజీవం ఉంచిన జ్ఞాపకాలను మరిచిపోలేక ప్రతి యేట వర్ధంతి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది 5వ వర్ధంతి నాడు ఇంటి ముందు కుక్క విగ్రహం ఏర్పాటు చేసి మూగజీవాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. కొసమెరుపేమిటంటే విగ్రహానికి ఎండ, వానల నుంచి రక్షణ కోసం షెల్టర్ కూడా ఏర్పాటు చేశాడు.