టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుబెట్టబోతుంది సమంత. ఇంకా బాలీవుడ్ సినిమాలో నటించక ముందే కాఫీ విత్ కరణ్ షోకి అతిధిగా వచ్చింది. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి. దీని పూర్తి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. పర్సనల్ విషయాలు రాబట్టడంలో కరణ్ దిట్ట. 'పుష్ప థియేట్రికల్ ట్రైలర్ కి రెండు వారాల ముందు "ఊ అంటావా మావ" వంటి పాటను చెయ్యడం ధైర్యమైన నిర్ణయమని మీరు అనుకుంటున్నారా? అని కరణ్ సామ్ ని అడిగాడు. నాకు ఆ పాట ఎంతో నచ్చింది అందుకే చేశాను. ఈ పురుషాధిక్య సమాజంలో వారి లోపాలను ఎట్టి చూపేందుకు ఇది సరైనదని నాకు అనిపించింది. పురుషాధిక్యత గురించి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. అమ్మాయిల చూపుల గురించి వ్యంగ్యంగా చాలా మంది మాట్లాడతారు. అబ్బాయిల చూపు వ్యంగ్యంగా ఉంటుందని నా లాంటి నటులు చెబితే అది అందరికీ అర్థం అవుతుందని అనుకున్నా అందుకే చేశా' అని సామ్ చెప్పుకొచ్చారు. 


Also Read: నాగ చైతన్య, సమంతను ఒక గదిలో పెడితే కత్తులు దూరంగా ఉంచాల్సిందేనా?


ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ప్రారంభమయ్యే సమయానికి నాకు అసలు రాజ్, డీకే ఎవరో కూడా నాకు తెలియదు. అప్పటికి ఇంక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ఇంక విడుదల కాలేదు. ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ పాత్ర చేసినట్లు సామ్ చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సామ్ బోల్డ్ క్యారెక్టర్ చేశారు.ఈ షోలో నాగచైతన్య తో విడిపోవడం గురించి కూడా సామ్ మాట్లాడారు. చైతూ, సమంత మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? అని కరణ్ మరో ప్రశ్నగా అడిగారు. ''ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచారనుకోండి... మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ (కత్తులు వంటివి) దాచేయాలి. ప్రస్తుతానికి అయితే అంతే! మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో, కొన్నాళ్ల తర్వాత అయితే పరిస్థితి స్నేహపూర్వకంగా ఉంటుందేమో'' అని సమంత చెప్పారు. 


సమంతతో కలిసి ఈ షోకి అక్షయ్ కుమార్ వచ్చారు. ఊ అంటావ మావ పాటకు సామ్ తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. కరణ్ క్యాంప్ ద్వారానే సామ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని మీద క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాలోని ఊ అంటావ పాటతో బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. 


Also Read : సౌత్, నార్త్ కాదు మేం ఇండియన్ యాక్టర్స్ - ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!