కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు. తమిళంలో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు భాషల్లో కూడా నటిస్తున్నారు ధనుష్. అలానే ఈ హీరోకి ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా అవకాశాలు కూడా వస్తున్నాయి. హాలీవుడ్ లో తెరకెక్కిన 'ది గ్రే మ్యాన్'(The Gray Man) సినిమాలో కీలకపాత్రలో పోషించారు ధనుష్. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు ధనుష్. హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకులు రుస్సో బ్రదర్స్ తో కలిసి ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ధనుష్. ఇందులో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు ధనుష్. 'ప్రస్తుతం బాలీవుడ్(Bollywood), సౌత్ మధ్య డిబేట్ నడుస్తుంది. మీ గురించి మాట్లాడినప్పుడు, రాసినప్పుడు ఇండియన్ స్టార్ అని మెన్షన్ చేయకుండా.. సౌత్ ట్యాగ్ ను యాడ్ చేస్తున్నారు. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి..?' అనే ప్రశ్న ధనుష్ కి ఎదురైంది.
దీనిపై స్పందించిన ఆయన..''సౌత్ ఇండియన్ యాక్టర్ అని పిలవాల్సిన అవసరం లేదు. అలా పిలవడంలో తప్పు కూడా లేదు. సౌత్ నుంచి వచ్చిన హీరో అని డీటైల్డ్ గా ఇవ్వడం మంచిదే కానీ ఇండియా యాక్టర్స్ అని పిలిస్తే బావుంటుంది. నార్త్ హీరోస్, సౌత్ హీరోస్ అని కాకుండా అందరూ కలిసి ఒక ఇండస్ట్రీగా మారాల్సిన సమయం వచ్చింది. ప్రతి సినిమా ఒక నేషనల్ ఫిలిం(National Film). అందరూ సినిమా చూడాలనే తీస్తారు. రీజినల్ సినిమా అని సెపరేట్ గా చూడకూడదు. డిజిటల్ మీడియా క్రేజ్ పెరిగిన తరువాత అన్ని సినిమాలను చూసే ఛాన్స్ వచ్చింది. ఇది మంచి విషయం. జనాలు టాలెంట్ ని గుర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో సౌత్ యాక్టర్స్ అని రిఫర్ చేయడంకంటే ఇండియన్ యాక్టర్స్ అంటే బావుంటుంది'' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది