బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసింది తనుశ్రీదత్తా. ఆ తరువాత కొంతకాలం పాటు విదేశాలకు వెళ్లిపోయింది. తిరిగి ఇండియా వచ్చిన తరువాత మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేసింది. నానా పటేకర్ లాంటి లెజండరీ ఆర్టిస్ట్ లపై ఆమె చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది తనుశ్రీ. 


రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. తనను టార్గెట్ చేశారని.. వేధిస్తున్నారని.. మొదట ఇండస్ట్రీలో పని లేకుండా చేశారని.. ఆ తరువాత చంపాలని చూశారని రాసుకొచ్చింది. పని మనిషి సాయంతో డేంజర్ మెడిసిన్స్, స్టెరాయిడ్స్ ను తన ఆహారంలో కలిపి ఇవ్వడానికి ప్రయత్నించారని.. ఆ తరువాత కారు బ్రేకులు ఫెయిల్ అయ్యేలా చేసి.. యాక్సిడెంట్ కి గురి చేశారని చెప్పుకొచ్చింది. 


అన్నీ దాటుకొని ముంబైకి వస్తే.. తన అపార్ట్మెంట్ ముందు కొందరు కావాలనే గొడవ చేస్తున్నారని తెలిపింది. ఈ వేధింపులకు భయపడి చావను.. పోరాడుతూనే ఉంటానని ఎమోషనల్ గా రాసుకొచ్చింది. బాలీవుడ్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించింది. మళ్లీ నటిగా కొత్త జీవితం మొదలుపెడతానని చెప్పింది. ఇక్కడి పరిస్థితులు ఎంతమాత్రం బాలేవని.. కేంద్రప్రభుత్వం ఇక్కడ కూడా పరిపాలన చేపట్టాలని చెప్పుకొచ్చింది. 


Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది


Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?