mahesh chandra Laddha: 1998 సివిల్స్ బ్యాచ్‌కు చెందిన మహేష్ చంద్ర లడ్హాను ఢిల్లీ నుంచి రప్పించి ఇంటెలిజన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. ప్రత్యేక తీసుకొచ్చి ఈ విభాగం అప్పగించడంపై చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఈ లడ్హా, ఎందుకీ బాధ్యతలు అప్పగించారనే డిస్కషన్ విపరీతంగా సాగుతోంది.
మహేష్ చంద్ర లడ్హా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక అధికారిగా పని చేశారు. ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేసిన తన ముద్రవేసి వేళ్లారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా కూడా ఉన్నారు. విజయవాడ నగర జాయింట్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, పని చేశారు. విభజన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వంలో వర్క్ చేశారు. 2019-20 మధ్య కాలంలో ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా ఉన్నారు. తర్వాత డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీస్‌కు వెళ్లారు. అక్కడ సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా పని చేస్తున్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా లడ్హా కేంద్ర సర్వీస్‌్లో పని చేశారు. ఎన్‌ఐఏలో దాదాపు ఐదేళ్లు ఎస్పీగా ఉన్నారు. డీఐజీగా కూడా వర్క్ చేశారు. ఆ వర్క్ ఎక్స్‌పీరియన్సే ఆయన్ని మళ్లీ ఏపీకి రప్పించింది. చంద్రబాబు ఏరికొరి లడ్హాను రాష్ట్రానికి రప్పించుకున్నారు. నిఘా చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు.
చంద్రబాబులా చావు నుంచి బయటపట్ట లడ్హా
తిరుపతిలో చంద్రబాబు వెళ్తున్న కాన్వాయ్‌ను మావోయిస్టులు పేల్చేసినట్టే లడ్హా కారును కూడా పేల్చేశారు. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పని చేస్తున్నటైంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన వాహనం వెళ్తున్న రోడ్డు కింద క్లెమోమైన్స్ పెట్టారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ కారుకావడంతో గాయాలతో లడ్హా క్షేమంగా బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్లతోపాటు ప్రయాణం చేస్తున్న ఇద్దరు పౌరులు మాత్రం మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇంటెలిజన్స్ చీఫ్‌గా నియమితులైన లడ్హా కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. వెంటనే ఆయనకు పోస్టును కేటాయించారు సీఎస్ నీరబ్ కుమార్.