ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ( AP Assmbly ) తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ( TDP ) వినూత్నమైన నిరసన కొనసాగిస్తున్నారు. గతంలో చిడతలు కొట్టిన ఎమ్మెల్యేలు శుక్రవారం ఏకంగా తాళిభొట్లను ప్రదర్శిస్తూ నిరనస వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కల్తీ సారా మరణాలతో పాటు మధ్య నిషేధంపై చర్చించాలని టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తాళిబొట్లతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత కొడుకు అరాచకం? అమ్మాయి కోసం అతనిపై ప్రతీకారం! - స్థానికంగా సంచలనం
అసెంబ్లీకి వచ్చే ముందు టీడీపీ ప్రజా ప్రతినిధులు తాళిబొట్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ( CM Jagan ) ఇచ్చిన హామీ గోవిందా గోవిందా’ అంటూ సమావేశాల చివరి రోజూ నారా లోకేష్ ( Nara Lokesh ) ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ ( Rally ) నిర్వహించారు. మద్యపాన నిషేధం అని మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ యూ టర్న్- అమరావతికే బీజేపీ కట్టుబడి ఉన్నాం : సోము వీర్రాజు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మండలిలోనూ, అసెంబ్లీలోనూ టీడీపీ సభ్యులు నిరసనలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణలపై టీడీపీ సభ్యులు రెండు సభల్లో పట్టు బడుతున్నారు. శాసనసభలో, మండలిలో కూడా ఇదే రకమైన డిమాండ్లతో వాయిదా తీర్మానాలు, చర్చ కోసం టీడీపీ ఆందోళనలు చేస్తుంది. సభలో తమ డిమాండ్ విషయమై సభను అలెర్ట్ చేసేందుకు శాసనసభలో విజిల్ వేసినట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అయితే వారు అలాంటి నిరసనలు వ్యక్తం చేసినప్పుడల్లా స్పీకర్ ( Speaker Tammineni ) వారిని సస్పెండ్ చేశారు.
అసెంబ్లీకి శుక్రవారమే చివరి రోజు. మద్యం పాలసీ, మాూడు రాజధానులు, పోలవరం వంటి అంశాలపై చర్చలు జరిగినా ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండానే సాగాయి. ఎప్పటికప్పుడు వారిని సస్పెండ్ చేస్తూ పోవడంతో కేవలం అధికారపక్ష వాయిస్ మాత్రమే అసెంబ్లీలో వినిపించింది.