Nara Lokesh Supports Woman Venkayamma: గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన వెంకాయమ్మ అనే మహిళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ రెడ్డి పాలన వద్దే వద్దు అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు లేక నారా లోకేష్ విజయం సాధించి అధికారంలోకి వస్తారని ఎస్సీ మహిళ వెంకాయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విజయంపై, వైసీపీ ఓటమిపై పందెం కాస్తానని, తన ఎకరంన్నర పొలం పందెం కాసేందుకు సిద్ధమని వెంకాయమ్మ అన్న మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం ధరలు భారీగా పెంచారని, ఉద్యోగాలు సైతం ఇవ్వడం లేదని, ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పింది.
వెంకాయమ్మ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్..
వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతి ఇంటా వినిపిస్తుందని, వైఎస్ జగన్ పరిపాలనకు ఆమె మాటలు నిదర్శననమి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మహిళ వెంకాయమ్మపై వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన దాడిని లోకేష్ ఖండించారు. జగన్ రెడ్డి పాలనలో పేదలకు అన్యాయం జరుగుతుందని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ గుండాలతో జగన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వెంకాయమ్మకు గానీ, ఆమె కుటుంబసభ్యులకుగానీ ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు లోకేష్.
‘జగన్‌రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా?.
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు.
నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది.. ఐదుకోట్లమందిపైనా దాడి చేయిస్తారా జగన్‌రెడ్డి గారు?’ అని ప్రశిస్తూ నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.
Also Read: Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్