Suryagarh Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరికి రూ .30వేల నుంచి రూ.78 వేల వరకు లబ్ధి చేకూరే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీఎం సూర్యఘర్‌ యోజన పథకాన్ని డ్వాక్రా సంఘాలకు అందివ్వాలని యోచిస్తోంది. ప్రతి డ్వాక్రా మహిళ ఇంటిపపై సోలార్‌ రూఫ్‌టాప్‌లు అమర్చేందుకు సిద్ధమైంది. రాయితీతో ఇచ్చే సోలార్‌ రూఫ్‌టాప్‌లు అమరిస్తే వారికి విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా వాళ్లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంది. 

ఇప్పుడు అమలు చేస్తున్న సూర్యఘర్‌పథకంలో ఒక కిలోవాట్‌ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంది. ఇందులో రూ.30 వేల రాయితీని కేంద్రం ఇస్తోంది.  రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.1.40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో రూ.60 వేల వరకు కేంద్రం రాయితీ ఇస్తోంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసుకోవాలంటే రూ.1.95 లక్షలు ఖర్చు పెట్టాలి. దీనికి కేంద్రం నుంచి రూ.78 వేలు రాయితీ వస్తుంది. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!

కేంద్రం చెప్పిన రూల్స్ ప్రకారం డ్వాక్రా మహిళ సంఘాలను చైతన్య పరిచి వారి వారి ఇళ్లపై ఈ సోలార్‌ రూఫ్‌టాప్‌లు ఏర్పాటుకు సిద్ధమైంది. ఆయా మహిళ ఇంటి సామర్థ్యం, వారు వినియోగించి విద్యుత్‌ వినియోగం ఆధారంగా వారికి ఎంత ఏ సామర్థ్యం రూఫ్‌టాప్ పెట్టాలో నిర్ణయిస్తారు.  అనంతరం వారికి ప్రభుత్వమే నేరుగా రూఫ్‌టాప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది. 

పీఎం సూర్య ఘర్‌ యోజన పథకం కింద లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. ఈ అప్పును సెర్ప్‌ అధికారులు అందిస్తారు. ఒకవేళ 10 శాతం కూడా చెల్లించలేని వాళ్లు ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి ఇచ్చే వెసులుబాటు కూడా కల్పిస్తారు. డ్వాక్రా మహిళలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్