విశాఖ నుంచి మంగళగిరి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీ వరకు వెళ్లేది లేదని... ఇక్కడే తేల్చుకుంటామన్నారు. వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే కాకుండా తెలంగాణ కూడా నష్టపోతుందన్నారు పవన్. 
 
ఐపీఎస్‌ అధికారులను ఎంతో ఉన్నతంగా చూసుకుంటాం కానీ అలాంటి స్థాయి అధికారి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటున్నారని ఆరోపించారు. పదే పదే నా చేయిపై కొట్టి మాట్లాడొద్దని... కూర్చోవాలని హుకూం జారీ చేశారన్నారు. రెచ్చగొడితే రెచ్చిపోతామని అనుకున్నారని తెలిపారు. ఏపీ పోలీస్‌ పై గౌరవం నమ్మకం లేని వ్యక్తి కింద పని చేస్తున్నారని అన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు చదివిన వ్యక్తులు క్రిమినల్స్‌కు సెల్యూట్ చేస్తున్నారి.. చాలా బాధగా ఉందన్నారు. అందుకే పాలిటిక్స్‌ను క్రిమినాలజీ తీసేయలన్నది ఎప్పుడూ నమ్ముతాను.. ఆ దిశగాన నా వంతు ప్రయత్నం చేస్తున్నానను అన్నారు. 


అరెస్టు చేసిన వారిని దారుణంగా హింసించారని... అరెస్టు చేసిన వాళ్లను పోలీసులతో బెల్ట్‌లతో కొట్టారని ఆరోపించారు పవన్. ఆడపిల్లలను బూతులు తిట్టారంట చెప్పుకొచ్చారు. 


నోరు జారే ప్రతి వైసీపీ లీడర్‌కు భవిష్యత్‌లో బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటారు కానీ... భోగాపురం విషయంలో ఓ మహిళతో కేసులు వేయించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములు లాక్కునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇలాంటి చాలా చోట్ల బెదిరింపులు చేస్తున్నారని విమర్శించారు. దసపల్లా భూముల విషయంలో ప్రభుత్వ భూములని చెబితే... కానీ... సంబంధం లేని కంపెనీకి వెళ్లిపోయాయన్నారు. ఇలాంటివి అడిగితే దాడులు చేస్తారన్నారు.. 


అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్‌కు భూములు ఇచ్చారని.... వాళ్ల పాదయాత్రను అడ్డుకోవడానికి మీరెవరని ప్రశ్నించారు పవన్. ఉత్తరాంధ్రపై ప్రేమ అంటూనే సైనికుల భూములు దోచుకున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము జనవాణి కార్యక్రమం జరపకపోయినా... 300పైగా దరఖాస్తులు స్వచ్ఛందంగా వచ్చాయన్నారు పవన్. అందులో ఎక్కువ ధర్మాన, ధర్మశ్రీ, విజయనగరం నేతలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని... అందులో భూముల కబ్జాకు సంబంధించినవే ఎక్కువన్నారు. అవన్నీ బయటకు వస్తాయని జనవాణి కార్యక్రమం జరగకుండా చేశారు.


వైసీపీని దించే వరకు జనసేన పోరాడుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి... పోరాటానికి రెడీ అవుతామన్నారు పవన్. తన సినిమాలు రిలీజ్‌ అయితేనే టికెట్‌ ధరలు గుర్తుకు వస్తాయి. తన పుట్టిన రోజు వస్తేనే పర్యావరణం గుర్తుకు వస్తుందన్నారు. జనవాణి అంటే లాఅండ్ ఆర్డర్‌ సమస్యలు వస్తాయని ఎద్దేవా చేశారు పవన్ కల్యాణ్. అందుకే ఇలాంటి విభజన రాజకీయాలు చేస్తున్న వైసీపీని గద్దె దించేందుకే పోరాడతామన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం కృషి చేస్తామన్నారు పవన్. అలా చేయకుంటే చాలా ప్రమాదమన్నారు. ఇదే కొనసాగితే తెలంగాణ ఏర్పడిన లక్ష్యం నెరవేరకుండా పోతుందన్నారు పవన్. ఉపాధి లేక ఆంధ్ర యువత తెలంగాణకు వలస వెళ్తుందని.. దీని వల్ల స్థానికులు నష్టపోతారన్నారు.