గత వారం విడుదలైన బ్రో సినిమా చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకుంటున్నాయి. సినిమాలో వైసీపీ మంత్రి అయిన తనిని ఇమిటేట్ చేసినట్లు సినిమాలోని కొన్ని సీన్లు ఉన్నాయంటూ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.  ఈ క్రమంలోనే ఈ సినిమా  పై ఆయన చాలా విమర్శలు చేశారు.


ఈ సినిమాకు సంబంధించిన లావాదేవిల గురించి కూడా ఆయన పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గురువారం ఎంపీ విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారు. మరి కొంత మంది ఎంపీలను కూడా ఆయన కలిసే అవకాశాలుననాయి. బ్రో సినిమాకు విదేశాల నుంచి నిధుల తరలింపు పై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు వారు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 


అసలు బ్రో సినిమానే పెద్ద కుంభకోణమని మంత్రి అంబటి అన్నారు. నేను మాట్లాడుతున్న మాటల్లో నిజం లేకపోతే పవన్‌ కల్యాణ్‌ కానీ, నిర్మాతలు కానీ ఇప్పటి వరకు ఎందుకు నా మాటలకు రియాక్ట్ కాలేదు అని ఆయన ప్రశ్నించారు. నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే. బ్రో సినిమాకు అక్రమంగా నిధులు వచ్చాయి. అవి కూడా విదేశాల నుంచి. 


వాస్తవాలు ఎందుకు దాస్తున్నారు. నిజాలు బయట పెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారు. నిజంగానే బ్రో సినిమాలో స్కామ్‌ లు జరిగాయా?  అంటూ సినిమా బృందాన్ని ప్రశ్నించారు.


ఈ సినిమాకు పెట్టుబడులకు మూలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని అంబటి మరోసారి ధ్వజమెత్తారు. అమెరికాలో తన పరివారంతో వసూలు చేసిన డబ్బును బ్రో సినిమా నిర్మాతలకు ఇచ్చి ఈ సినిమాను తీసినట్లుగా అంబటి ఆరోపిస్తున్నారు. 


అసలు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? కలెక్షన్లు ఎంత? ఈ సినిమాకు పవన్‌ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? ట్యాక్స్ కట్టింది ఎంత?  అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. సినిమా గురించి మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న అంబటి రాంబాబు పై తేజ్‌ పరోక్షంగా పంచ్‌ లు వేశారు.


సినిమాని సినిమాల మాత్రమే చూడాలి. అంతేకానీ పర్సనల్ గా తీసుకోకూడదు అంటూ తేజ్‌ అంటే...అంబటి వెంటనే దానికి కౌంటర్ గా సినిమాని సినిమాల తీయండి. అంతేకానీ మధ్యలో మమ్మల్ని కేలకడమెందుకు. నన్ను కేలికితే రియాక్షన్‌ చాలా దారుణంగా ఉంటుందని అంబటి అన్నారు.


నా మీద ఎన్ని వెబ్‌ సిరీస్ లు అయినా తీసుకోండి. అంతే కానీ మధ్యలో మమ్మల్ని కెలికితే మాత్రం మీకే నష్టం అంటూ ఆయన చురకలంటించారు.