ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులను నిర్ణయించిన కళాశాలలు ఫీజులను మరో 10 శాతం పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, రుసుముల నియంత్రణ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం ఖరారు చేసిన ఇంజినీరింగ్ ఫీజులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ‌స్టు 2న‌ విచారణ జరిగింది. న్యాయస్థానం ప్రతిపాదించిన ఫీజులపై తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజులను ప్రభుత్వం సవరించింది.

ఏపీలో ఇంజినీరింగ్ కనీస ఫీజును రూ.35 వేలు చెల్లిస్తున్నారు. కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రూ.43 వేలుగా హైకోర్టు నిర్ణయించింది. రూ.70 వేల నుంచి రూ.1.05లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్న కాలేజీల్లో మరో 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2023కు 3,14,797 మంది హాజురు కాగా 2,52,717 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,71, 514 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది అర్హత సాధించారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఫీజులకు సంబంధించి కనిష్టంగా 42,500 అంతకంటే ఎక్కువ ఫీజులుంటే 10 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని హైకోర్టు వెల్లడించింది. మరోవైపు ఏపీ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ 2023-24 నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 

వెబ్‌ఆప్షన్ల ప్రక్రి వాయిదా..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌ జులై 24న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 3 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగనుంది. అయితే ఆగస్టు 3 నుంచి ప్రారంభంకావాల్సిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 3 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. ఆగస్టు 7కి వాయిదా వేసినట్లు కన్వీనర్‌ నాగరాణి తెలిపారు. తాజా షెడ్యూలు ప్రకారం విద్యార్థులు ఆగస్టు 7 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక వీరికి ఆగస్టు 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 

కౌన్సెలింగ్ షెడ్యూలు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..