Amaravati Farmers to Delhi :  అమరావతి రైతులు ఢిల్లీలో ఆందోళన చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేక రైలులో రైతులు ఢిల్లీ బయలుదేరారు.  ఈ నెల 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.  15వ తేదీన మద్యాహ్నం రెండు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి రాజధాని రైతుల ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలు దేరింది. 16వ తేదీ రాత్రి కి ప్ర ఢిల్లీకి చేరుతుంది. మరుసటి రోజు 17వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గోంటారు. ఈ సందర్బంగా పలువురు కేంద్ర మంత్రులను కూడ రాజదాని రైతులు కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్నరైతులు 


ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే ప్రధాన  డిమాండ్‌తో  ఆందోళన నిర్వాహిస్తున్నామని అమరావతి జేఎసి స్పష్టం చేసింది. రాజధాని రైతులతో ప్రత్యేక రైలు నిండిపోయింది. విజయవాడ నుండి బయలుదేరి రైతులు పలు స్టేషన్లలో ప్రత్యేక హల్టింగ్ ఇచ్చారు.దీంతో అక్కడ కూడ రాజదాని మద్దతుగా వచ్చే వారినికి కలుపుకొని వెళతామని జేఎసి నేతలు తెలిపారు.అమరావతి కోసం తాము చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుందని జేఏసీ నేతలు చెబుతున్నారు.  ఎపీతో పాటుగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారంతా ఢిల్లీ కేంద్రంగా జరిగే ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు.


అరసవిల్లి  పాదయాత్ర అర్థంతరంగా నిలిపివేత 


అమరావతి రాజధాని కోసం రైతులు రెండో విడత నిర్వహించిన పాదయాత్ర అర్దాంతరంగా నిలిచిపోయింది.  మెదట విడత అమరావతి నుండి తిరుమలకు జరిగిన పాదయాత్ర సక్సెస్ అయ్యింది. ఆ తరువాత అత్యున్నత న్యాయస్దానం కూడ ఎపీ రాజదాని అమరావతికి మద్దతుగా తీర్పు వెలువరించింది. దీంతో రాజదాని రైతులు సంతోషం తో సంబరాలు చేసుకున్నారు. అయినా ఎపీ ప్రభుత్వం మూడు రాజధానులకే  కట్టుబడి ఉన్నామని కోర్ట్ కు తెలపటంతో రైతుల్లో మరో సారి ఆందోళన మెదలైంది. మరో సారి అమరావతి నుండి అరసరవల్లికి పాదయాత్ర చేపట్టి తూర్పుగోదావరి జిల్లా వరకూ వెళ్లారు. అక్కడ ఉద్రిక్త పరస్థితులు ఏర్పడటం... కోర్టు ఆంక్షలు విధించడంతో పాదయాత్ర ఆగిపోయింది. 


ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం 


ఆ తరువాత ఉద్యమం తీవ్రతరం చేసే క్రమంలో భాగంగా రాజదాని రైతులు ఢిల్లీ కేంద్రంగా దర్నా నిర్వహించాలని నిర్ణయించారు.దీంతో ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసుకొని విజయవాడ నుండి రాజదాని రైతులు ఢిల్లీకి వెళ్లారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది.  మూడు ప్రాంతాలకు ఒకే రకంగా చూడాలని,అన్ని జిల్లాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తామంటూ అదికార పక్షం తీసుకున్న నిర్ణయం సంచలనం అయ్యింది.అయితే వైసీపీ మాత్రమే మూడు రాజదానులకు మద్దతు పలకగా,మిగిలిన అన్ని రాజకీయ పార్టిలు అమరావతికే మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు రెడీ అయ్యారు.