తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్షాలు ర్యాలీలకు పిలుపునిచ్చిన వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం, దాన్ని సమర్థిస్తూ మరో వర్గం ర్యాలీ చేసేందుకు యత్నించారు.
ఆర్-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన చేపట్టారు. దీక్షకు పిలుపునిచ్చారు. ఆ టైంలోనే వైసీపీ మద్దతు దారులు ఆర్-5 జోన్‌లో ఇళ్లు కేటాయింపును సమర్ధిస్తూ కృతజ్ఞత ర్యాలీకి ప్లాన్ చేశారు. బైక్ ర్యాలీ చేయాలని నిర్మయించారు.
ఇలా ఇరువర్గాల ర్యాలీలతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తుళ్లూరులో 144 సెక్షన్ వధించారు. పోలీసుల యాక్ట్ 30 అమల్లో ఉందని ప్రజలకు తెలియజేశారు. పక్కనే ఉన్న అమరావతి రైతుల దీక్ష శిబిరాన్ని కూడా పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
భారీ సంఖ్యలో ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులు ఎవర్నీ ఎటు కదలనీయకుండా చేశారు. నిరసన చేస్తున్న వారిని, దీక్షకు కూర్చున్న వారిని అరెస్టు చేశారు. ప్రతిఘటించిన వారిని లాగి పడేశారు. మహిళలు, వృద్ధులు అని చూడకుండా నెట్టేశఆరు.
పోలీసుల చర్యలను తెలుసుకొని రైతులకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు వచ్చిన జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారందర్నీ బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తుళ్ళూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.