ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు ముగియడంతో.. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని అధికారులు మే 23న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలవారీగా మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 26 ఉదయం 9 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది. 


Master Engineering Question Paper With Preliminary Keys:


➥  15 May 2023 Forenoon


15 May 2023 Afternoon


➥ 16 May 2023 Forenoon


16 May 2023 Afternoon


➥ 17 May 2023 Forenoon


➥ 17 May 2023 Afternoon


➥ 18 May 2023 Forenoon


➥ 18 May 2023 Afternoon


➥ 19 May 2023 Forenoon


➥ Response Sheet for AP EAPCET - 2023


నేడు అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కీ..
అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కీ 24న ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక కీ ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మే 15న మొదలైన ఈఏపీసెట్ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


Also Read:


తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. మే 25న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి.డీన్‌ కుమార్‌ మే 23న ఒక ప్రకటనలో తెలిపారు. మే 25న ఉదయం 11 గంటలకు కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.  


మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష; మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు.


ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు. ఎంసెట్ ఫ‌లితాల కోసం eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్లను లాగిన్ అవొచ్చు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..