Amaravati Loksabha :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రూ.2046 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. కేంద్రం వాటాగా రూ.488 కోట్లు కూడా విడుదల చేసిందని వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పార్లమెంటులో తెలుగు దేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు.  ప్రశ్నోత్తరాల సమయంలో స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టాల్సిన పనుల సంగతేంటని గల్లా ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయిందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అమరావతిలో మొత్తం 21 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం నిధులిచ్చినా పెద్దగా చెప్పుకునే విధంగా అక్కడ పనులు మాత్రం జరగలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పనులు పూర్తికాకపోవడానికి కారణాలను మాత్రం వివరించలేదు. 


అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్‌లో అమరావతి అంశం ప్రస్తావన


ఈ పార్లమెంట్ సమావేశాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా గల్లా జయదేవ్  అమరావతి అంశాన్ని తెరపైిక తెస్తున్నారు. మూడు రోజుల కిందట  ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రకటించాలని ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో అన్ని అభివృద్ధి ప్రాజెక్టులూ నిలిచిపోయినందున.. రాజధాని అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులపై లోక్‌సభలో జరిగిన చర్చలో  గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలుచేసారు.  తమ హక్కుల కోసం రైతులు ఇంత సుదీర్ఘకాలంగా ఆందోళన సాగించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదున్నారు.  


ఢిల్లీలో  17వ తేదీన ధర్నా చేయనున్న అమరావతి రైతులు


ఢిల్లీలో ధర్నాకు అమరావతి రైతులు బయలుదేరారు.  ఈ నెల 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.  15వ తేదీన మద్యాహ్నం రెండు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి రాజధాని రైతుల ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలు దేరింది. 16వ తేదీ రాత్రి కి ప్ర ఢిల్లీకి చేరుతుంది. మరుసటి రోజు 17వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గోంటారు. ఈ సందర్బంగా పలువురు కేంద్ర మంత్రులను కూడ రాజదాని రైతులు కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 


అర్థాంతరంగా నిలిచిపోయిన పాదయాత్ర


అమరావతి రాజధాని కోసం రైతులు రెండో విడత నిర్వహించిన పాదయాత్ర అర్దాంతరంగా నిలిచిపోయింది.  మెదట విడత అమరావతి నుండి తిరుమలకు జరిగిన పాదయాత్ర సక్సెస్ అయ్యింది. ఆ తరువాత అత్యున్నత న్యాయస్దానం కూడ ఎపీ రాజదాని అమరావతికి మద్దతుగా తీర్పు వెలువరించింది. దీంతో రాజదాని రైతులు సంతోషం తో సంబరాలు చేసుకున్నారు. అయినా ఎపీ ప్రభుత్వం మూడు రాజధానులకే  కట్టుబడి ఉన్నామని కోర్ట్ కు తెలపటంతో రైతుల్లో మరో సారి ఆందోళన మెదలైంది. మరో సారి అమరావతి నుండి అరసరవల్లికి పాదయాత్ర చేపట్టి తూర్పుగోదావరి జిల్లా వరకూ వెళ్లారు. అక్కడ ఉద్రిక్త పరస్థితులు ఏర్పడటం... కోర్టు ఆంక్షలు విధించడంతో పాదయాత్ర ఆగిపోయింది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు రెడీ అయ్యారు.