AP Hight Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపై లైట్లు బాగుచేసేందుకు ప్రభుత్వం అడిగిన 3 నెలల సమయాన్ని ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. లైట్ల మరమ్మతు పనులు 2 నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది. 


అసలేం జరిగిందంటే


ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపై వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వీధి లైట్లు వెలగక న్యాయవాదులు, ఉద్యోగులు, కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారని అందులో పేర్కొన్నారు. 


దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. 60 రోజుల్లోగా లైట్లు, రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించింది. ఉద్యోగులు. న్యాయవాదులు, ఇతరుల భద్రత దృష్ట్యా త్వరితగతిన పనులు చేయాలని సూచించింది. అయితే మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం తరఫున లాయరు 3 నెలల సమయం కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. 2 నెలల్లోనే పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.