YS Jagan Davos Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌ సదస్సుకు ఏపీ సీఎం జగన్‌తో పాటు కొందరు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దావోస్ పర్యటన ముగిసినా రెండు మూడు రోజులపాటు అక్కడే గడిపిన ఏపీ  సీఎం జగన్ స్వదేశానికి చేరుకున్నారు. దావోస్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్‌, మంత్రుల బృందం అర్ధరాత్రి స్వదేశానికి చేరుకోగా.. గన్నవరం విమానాశ‍్రయంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులు సీఎం జగన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. 


సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే వంశీ ఘన స్వాగతం
దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన సీఎం జగన్‌కు తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘన స్వాగతం పలికారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రులు, సీఎస్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే వంశీ సైతం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని సీఎం జగన్, మంత్రులు, అధికారులకు స్వాగతం పలకడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ పార్టీలో తనతో కలిసి పనిచేసే వాళ్లను కలుపుకునిపోతానని వ్యాఖ్యానించిన వల్లభనేని వంశీ.. విదేశీ పర్యటన ముగించికుని వచ్చిన సీఎం, మంత్రులకు ఘనస్వాగతం పలకడం టీడీపీ శ్రేణులకు షాక్ అని చెప్పవచ్చు.






దావోస్‌లో ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు.. 
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపీ సీఎం జగన్, మంత్రుల టీమ్ పలు అంతర్జాతీయ కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది.  రాష్ట్రంలో ఇథనాల్‌ తయారీకి రూ.250 కోట్ల పెట్టుబడితో ప్లాంటు పెడతామని మహీంద్రా అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని మమ్మల్ని ఆహ్వానించారు. మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దేందుకు  టెక్‌ మహీంద్రాను ఆహ్వానించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నాని పేర్కొన్నారు. 


ఈజ్‌ మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టితో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తామని ప్రశాంత్‌ పిట్టి తెలిపారు. త్రీడీ సంబంధిత ఉత్పత్తులను అందిస్తున్న ఫ్రెంచ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ కంపెనీకి 140 దేశాల్లో 20వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. విద్యా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ ఆసక్తి చూపింది. 


Also Read: Khammam: సీఎం జగన్‌‌పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి? 


Also Read: YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం