స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుపై ఏంఓయూ కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బుధవారం నాడు ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్‌ చలమలశెట్టి సంతకాలు చేశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ స్వయంగా వివరిస్తున్నారు.






యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో జగన్‌ భేటీ.
దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీషో సీఈఓ విదిత్‌ ఆత్రేయ, బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ సుష్మిత్‌ సర్కార్, కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ గ్రూప్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్, ఈజీమై ట్రిప్‌ ప్రశాంత్‌పిట్టి, వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, కొర్‌సెరా వైస్‌ ప్రెశిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌ ఉన్నారు.






టూరిజంపై చర్చలు
ఈజ్‌ మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టితో సమావేశంలో భాగంగా ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. యి. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తామని ప్రశాంత్‌ పిట్టి తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక స్థలాల డెవలప్‌మెంట్‌తో పాటు టూరిస్ట్ ప్లేస్‌లకు మరింత గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు.


యూనికార్న్ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖ
విశాఖను యూనికార్న్ స్టార్టప్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. ఏపీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, వాటి అభివృద్ధిపై బుధవారం పలు కంపెనీల సీఈవోలు, ఇతర ముఖ్య ప్రతినిధులతో ఏపీ సీఎం చర్చించారు. విశాఖలో పెట్టుబడులకు మీ అందరికీ ఏపీ ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. స్టార్టప్‌లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, వనరులు సమకూర్చడానికి సైతం సిద్ధమని విదేశీ సంస్థల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించారు.  


స్విట్జర్లాండ్‌లో నైపుణ్యాలను అభివృద్ది చేసేందుకు అనుసరిస్తున్న శిక్షణా విధానాలను తెలుసుకునేందుకు సీఎం జగన్‌ లూజర్న్‌ సమీపంలో షిండ్లర్‌ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వోకేషనల్‌ ట్రైనింగ్‌లో ఉన్న విద్యార్ధులతో ముచ్చటించారు. నైపుణ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకుంటున్నది అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న 1929 నాటి లిఫ్ట్‌ లో కూడా ఆయన ప్రయాణించారు. 






సీఎం జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు
దావోస్‌ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌ను ప్రవాసాంధ్రులు కలిశారు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని సీఎంకు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కితాబిచ్చారు.






Also Read: MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !


Also Read: Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !