Sajjala On Amalapuram Attacks :  అమలాపురం ఘర్షణలపై పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని.. ఆయన చదివిన స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ రాజకీయ ఆటలు ఆడుతోందన్న పవన్ విమర్శలను సజ్జల ఖండించారు.  ఇలాంటి కుంచితమైన ఆలోచన మాకు లేదని..  కులాల మధ్య చిచ్చు పెట్టి లాభం పొందాలనే ఆలోచన చంద్రబాబుకే ఉందని సజ్జల ఆరోపించారు. ఈ అంశంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం కూడా వేశారన్నారు.  పవన్ కల్యాణ్ రాంగ్ ట్యూషన్ మాస్టర్‌ వద్ద ట్యూషన్ చెప్పించుకుంటున్నారని విమర్శించారు.  చంద్రబాబు మార్గం  వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం... ఎడా పెడా పొత్తులు పెట్టుకోవడమన్నారు. జగన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ కానీ కులాలను వాడుకొని, లేదా చిచ్చు పెట్టి, ఓ వర్గం వాడుకొని, కులాలను వాడుకొని అధికారంలోకి రాలేదు.. రావాలని అనుకోవడం లేదు.  అధికారంలోకి వచ్చాక అన్ని సమాజిక వర్గాలకు అర్హత ఉన్న వారికి దళారీ తనం అవసరం లేకుండా డైరెక్ట్ అందజేయడం ద్వారా క్యాలెండర్ పెట్టి ఇస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు.  


పవన్ మైండ్‌సెట్‌ను చంద్రబాబు ట్యూన్ చేశారు ! 


పవన్ కల్యాణ్ మైండ్ సెట్ ట్యూన్‌ చేయడంలో చంద్రబాబు విజయవంతమయ్యారన్నారు. టీడీపీ హయాంలో జరిగినన్ని రేప్‌ కేసులు, దాడులు గానీ ఇప్పుడు జరగడం లేదు. పవన్‌ కల్యాణ్‌కు అవసరమైతే సమాచారం పంపిస్తామని సజ్జల తెలిపారు.  ఇప్పటికైనా సిన్సియారీటీ ఉంటే మీకు మీరుగా స్టడీ చేయమని సలహా ఇచ్చారు. చట్టం ప్రకారం అన్ని జిల్లాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. పవన్ కల్యాణ్ సరిగా ప్రిపేర్ అవలేదన్నారు. అంబేద్కర్ పేరును కడపకు పెట్టొచ్చు కదా అంటే.. ఇలాంటివి చిన్న పిల్లలు మాదిరిగా ఉంది. అదేమన్నా పనికి వచ్చే ఆర్గ్యుమెంటా... అని ప్రశ్నించారు.  అంబేద్కర్ పేరు పెట్టాలా వద్దా... మీ స్టాండ్‌ ఏంటి... అని విపక్ష పార్టీలను సజ్జల ప్రశ్నించారు.  దాడి పూర్తిగా అది రాజకీయ ప్రేరేపితం... దాన్ని రాజకీయంగా ఎదుర్కొంటున్నామని సజ్జల తెలిపారు.  


మా నేతలపై దాడులు చేసుకుని ఏం సాధిస్తాం ?


ప్రజలు కోరినందున కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని.. . అందుకు పర్యవసానంగా నిన్న దాడి చేశారన్నారు. దాడులు ప్లాన్డ్‌గా జరిగాయని.. దీనిపై విపక్షాల విమర్శలు దుర్మార్గమన్నారు.  అధికార పార్టీ నేతలప ఇళ్లపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేసుకుంటుందిని ఆయన ప్రశ్నించారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేసుకుని ఏం సాధిస్తామని ఆయన ప్రశ్నించారు.  విపక్ష నేతల ఆరోపణలను  ప్రజలు చీదరించుకుంటారుని..  దుర్మార్గపు రాజకీయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నారు.  అటాక్ ప్లాన్ చేసింది చేయించింది.. దాన్ని మాపై వేయాలని చూస్తుంది విపక్షాలేనని సజ్జల ఆరోపించారు.  


టీడీపీ, జనసేన ప్రోద్భలంతోనే దాడులు ! 


ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్యం  సాయి అనే వ్యక్తి అందరితోనూ ఉన్నాడని సజ్జల తెలిపారు.  జనసేన తరఫున పోటీ చేసిన వ్యక్తి కూడా ఉన్నాడని తెలుస్తోందని..  తెలుగుదేశం, జనసేన ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగిందన్నారు.  విపక్షాలు ఇలాంటి నిచమైన పని చేస్తాయని ఎవరూ ఊహించలేదు.. అందుకే పోలీసులు అలెర్ట్‌గా లేక ఉండకపోవచ్చునన్నారు సజ్జల.  తర్వాత పోలీసులు నిగ్రహం కోల్పోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.  మా పార్టీ లీడర్లు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయి ఉంటే చంద్రబాబు, పవన్ అనుకున్న లక్ష్యం నెరవేరేదన్నారు.