Chandra Babu: సొంతింటి కళను సాకారం చేసుకోవాలనుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తను చెప్పాయి. నిరుపేదలు ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచనున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన 2.0 కింద 2024-25 ఏడాదిలో నిర్మించనున్న ఇళ్లకు సంబంధించిన విధి, విధానాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. తాజా మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులను తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ గైడ్‌లైన్స్‌ను ఎన్నికల ముందే రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం పంపింది.


కేంద్రం నిర్ధేశించిన మార్గదర్శకాలు ప్రకారం ఈ పథకంలో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా అందించే సాయం భారీగా పెరగనుంది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందనుంది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.250 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కచ్ఛితంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేసింది. సాంకేతికతను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని అందించనుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తరువాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు. గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదించే అవకాశముంది. 


Also Read: ఆగస్టు 15 నుంచి ఇంటింటా క్యాన్సర్ పరీక్షలు - మరో కొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం


మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలకు సిద్ధం.. 


దేశ వ్యాప్తంగా పీఎంవై (పట్టణ) 2.0 పథకం కింద ప్రధాని మోదీ మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మిస్తారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకూ ఈ పథకం వర్తించనుంది. ఇక్కడి పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలతోపాటు ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు అందనుంది. 


వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు బట్టిన కేంద్రం


గత వైసీపీ ప్రభుత్వం అ30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించినట్టు ప్రచారం చేసుకుంది. కానీ, 20 లక్షల మందికే ఇచ్చారు. ఇందులో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. అందులో 6.50 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. నాలుగు లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదు. మిగతావన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. గతంలో పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1.50 లక్షలు అందించింది. దీంతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థల్లో ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు ఇచ్చింది. కానీ, వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో ఒక్కో ఇంటికి రూ.30 వేల చొప్పున అందించి చేతులు దులుపుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని దాదాపు 2 లక్షల ఇళ్లే మంజూరు చేయలేదు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వ తీరును తప్పు బట్టింది. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవని తేల్చి చెప్పింది. 


Also Read: అన్న క్యాంటీన్లు, విద్యాకానుకపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన ప్రభుత్వం- లోకేష్‌ను అభినందించిన పవన్