Andhra Pradesh Land Registration Rates : ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతానికి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత పెంచాలనే విషయం ప్రస్తుతానికి ప్రభుత్వం సస్పెన్స్‌లో ఉంచింది. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, రాబోయే ప్రాజెక్టురేట్లను దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంచనున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెంచాల్సిన ధరలపై ప్రభుత్వం నివేదిక కోరింది.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి రెవెన్యూ అవసరమని అందుకే ప్రజలపై పెద్దగా భారం వేయకుండా ఫీజుబులిటీ ఉన్న ప్రాంతాల్లోనే భూములు రేటు పెంచబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం విధానాలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. దాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర రెవెన్యూ పెంచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజల ఇబ్బంది లేకుండా శాస్త్రియా పద్దతిలోనే భూముల విలువల పెంచబోతున్నట్టు మంత్రి అనగాని వెల్లడించారు. అభివృద్ధి కారిడార్లు, ఇతర ప్రాజెక్టులు ఉన్న ప్రాంతంలోనే రేట్లు పెంచేందుకు మొగ్గు చూపామన్నారు. గతంలో రిజిస్ట్రేష్ రేట్లు పెంచినప్పటికీ అది శాస్త్రియంగా జరగలేదని కొన్ని ప్రాంతాల్లో భూమి రేటు కంటే రిజిస్ట్రేషన్ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. అన్నింటినీ సరి చేసి న్యాయబద్దంగా వాల్యూ పెంచుతామన్నారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ తగ్గే ఛాన్స్స కూడా ఉందన్నారు. పెరిగిన చోట 15 నుంచి 20 శాతం మాత్రమే పెంచుతామన్నారు మంత్రి
ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మారుస్తున్నారని టాక్ నడుస్తోంది. ఏరియాను బట్టి భూమికి విలువ కట్టనున్నారు. కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగా.. జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్నవి.. వాటి వెనుక ఉన్నవి అంటు విభజించి చెప్పేవాళ్లు. ఇప్పుడు ఈ గ్రేడింగ్‌లో రెండు రకాలు వస్తాయని అంటున్నారు.