Andhra Pradesh: మోటారు వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే రూల్‌ను అమలు చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో చాలా మంది ప్రమాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది కోర్టు.
ట్రాఫిక్స్ రూల్స్ ఇతర అంశాలపై ఏపీ పోలీసులకు ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. హెల్మెట్‌ను కంపల్సరీ చేయాలని ఆదేశించింది. వీటితోపాటు ఇతర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయాల్సిందేనంది వివరించింది. ఎలాంటి రూల్స్ ఎలా అమలవుతున్నాయో కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించింది.
ట్రాఫిక్ విధుల్లో ఉన్న అధికారులు, వాహనాలు తనిఖీలు చేసే అఫిషియల్స్ కూడా కొన్ని రూల్స్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది. సిబ్బంది కూడా బాడీ కెమెరాలు ధరించాలని తేల్చి చెప్పింది. రూల్స్ పాటించని వారి వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి మార్పు తీసుకురావాలని సూచించింది.
ట్రాఫిక్ రూల్స్, వాహన చట్టంలోని నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని న్యాయసాధికర సంస్థకు సూచించింది ఏపీ హైకోర్టు. మీడియాలో ప్రకటనలు జారీ చేయడం, ఇతర మార్గాల్లో జనాల్లో అవేర్‌నెస్ పెంచాలని పేర్కొంది. హెల్మెట ధరించకపోవడంతో వల్ల వేల మంది ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని ఇందులో అందరి నిర్లక్ష్యం ఉందని ఓ లాయర్ వేసిన పిటిషన్‌పై హైకోర‌్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. అప్పటిలోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.