Diwali Wishes: దీపావళి సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్‌లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండీ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓ చిన్న పిల్లాడు పాడుతున్న పాటను షేర్ చేసి కీలక కామెంట్స్ పోస్టు చేశారు. 


సింధి భాషలో ఓ బాలుడు పాడుతున్న పాట వైరల్‌గా మారుతోంది. భారత్‌ నుంచి విడిపోయామన్న బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ కల్యాణ్ రీషేర్ చేశారు. పాకిస్థాన్‌లో ఉంటున్న  హిందువులు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఆ పెయిన్‌ ఈ బాలుడి పాటలో తెలుస్తోందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 






ఇంకా పవన్ ఎక్స్‌లో ఏం పోస్టు చేశారంటే...." పాకిస్థాన్‌కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన బాధ తెలియజేస్తోంది. భారత్‌లో కలవాలనే ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది." అని చెప్పుకొచ్చారు. 


అంతే కాకుండా ఆయా దేశాల్లో ఉంటున్న హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. " పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో ఉంటున్న హిందువులకు నా హృదయపూర్వక 'దీపావళి' శుభాకాంక్షలు."


బంగ్లాదేశ్‌లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు, అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు గురించి ప్రస్తావించారు. వాళ్లకు దేవుడు ధైర్యం ఇవ్వాలని వేడుకున్నారు. "బంగ్లాదేశ్‌లోని హిందువుల ఉన్న పరిస్థితిలో శ్రీరాముడు బలం ధైర్యాన్ని ప్రసాదిస్తాడని ఆకాంక్షించారు. 'మేమంతా మీ భద్రత కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.  అందు కోసం ప్రార్థనలు చేస్తున్నాం.


ప్రపంచంలో ప్రజల భద్రత, స్వేచ్ఛను కాపాడేందుకు పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. అలాంటి ప్రతినిధులు వారి వద్దకు చేరుకొని సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. " భద్రత, ప్రాథమిక హక్కుల కోసం పని చేస్తున్న ప్రపంచ స్థాయి సంస్థలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురి అవుతున్న హిందువుల వద్దకు చేరుకుంటారని ఆశిస్తున్నాను."


ఈ రెండు దేశాల్లో దాడులకు గురి అవుతున్న  వారి కోసం భారత్‌లోని ప్రజలంతా ప్రార్థిస్తారని భరోసా ఇచ్చారు పవన్ కల్యాణ్. "ఈ రోజు దీపావళి రోజున బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిలోనూ హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం." అని పిలుపునిచ్చారు. 


Also Read: దీపావళి జరుపుకోని ఊరు బిశ్రక్ -ఎందుకంటే!