AP CM And Ministers Salary: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే పదవిలో ఉన్నంత కాలం వారికి వచ్చే శాలరీ ఎంత ఇతర సౌకర్యాలు ఏముంటాయనే చర్చ జరుగుతోంది.  చంద్రబాబు జీతమెంత? పవన్ ఎంత జీతం తీసుకోబోతున్నారు?  ఎమ్మెల్యేలకు నెలకు ఎంత వస్తుంది?  వీరికున్న సౌకర్యాలేంటి?  దేశంలోని వివిద రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల జీతాల సంగతేంటి? వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు ఎలా ఉంటాయి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు, శాసన సభ్యులకు వేతనాలు, వివిధ రకాల భత్యాలతో పాటు  ఆయా ప్రభుత్వాలు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తున్నాయి. దేశమంతటా ఈ జీత భత్యాలు ఒకేలా ఉండట్లేదు. ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుంది. సాధారణంగా శాసన సభకు ఎన్నికైన ప్రతి సభ్యునికి వేతనంతో పాటు ఉండేందుకు ఎమ్మెల్యే క్వార్టరు లేదా.. హౌస్ రెంట్ ఎలవెన్స్,  అసెంబ్లీకి అటెండ్ అయ్యేందకు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, నియోజకవర్గ ఎలవెన్స్, కంటిజెన్సీ అలవెన్స్, కన్వెయన్స్ అలవెన్స్ సెక్రటేరియట్ ఎలవెన్స్‌లు కూడా ఇస్తున్నారు. 


చంద్రబాబు, పవన్ తీసుకోబోయేది ఇదే.. 


ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా తన వేతనంతో పాటు ముఖ్యమంత్రిగా సైతం అదనంగా వేతనం అందుకుంటారు. ఇతర అన్ని అలవెన్సులూ కలిపి ఆయనకు నెలకు రూ. 3,35,000 అందనుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సైతం ఎమ్మెల్యేగా తనకొచ్చే వేతనం ఇతర ఎలవెన్సులతోపాటు మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామ్యమైనందున అదనంగా కొంత వేతనం, ఇతర అలవెన్సులు అందనున్నాయి.  అన్నీ వెరసి ఆయన సైతం దాదాపు రూ. 3 లక్షల మేర అందుకోనున్నారు. లోకేశ్ సహా ఏపీలో చంద్రబాబుతో కలిసి ప్రమాణం చేసిన ఇతర మంత్రులందరికీ దాదాపు ఇదే మొత్తం అందనుంది. 


ఎమ్మెల్యే జీతం 12 వేలు.. !


ఏపీలోని ఇతర ఎమ్మెల్యేల విషయానికొస్తే.. వారికి వేతనం రూ. 12వేలు. నియోజకవర్గ అలవెన్సు రూ. 1.13 లక్షలు. ఇంటి అద్దె ఎలవెన్సు రూ. 50 వేలు.  సిటింగ్, టెలిఫోన్, కంటింజెన్సీ, కన్వేయన్స్, సెక్రటేరియట్ తదితర అలవెన్సులన్నింటికీ రోజుకు రూ.800. వెరసి నెలకు దాదాపు రూ. 2లక్షల మేరకు అందుకోనున్నారు. వీరికి తమ టర్మ్ ముగిసిన అనంతరం రూ. 25 వేల మేరకు పెన్షన్ అందనుంది.


ఇతర సౌకర్యాలు.. ఎమ్మెల్యేలకు వాహనాలు లేకపోతే వాహన కొనుగోలుకు అడ్వాన్సులు ఇస్తున్నారు. వీరికి అవసరాన్ని బట్టీ ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు ఇస్తారు. 1 + 1 లేదా  2+2 గన్ మెన్లను ఏర్పాటు చేస్తారు. 


వీరికి ఎక్కువ


ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్, మండలి డిప్యూటి ఛైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, పీఎసీ ఛైర్మన్ వంటి వారికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాల కంటే ఎక్కువగా వేతనం ఉంటుంది. 


తెలంగాణ టాప్ 


ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి చూస్తే.. ముఖ్యమంత్రుల్లో అన్ని అలవెన్సులూ కలిపి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దేశంలోనే అతి ఎక్కువ వేతనం రూ. 4.1 లక్షలు  తీసుకుంటుండగా.. త్రిపుర సీఎం మానిక్ సాహా అతి తక్కువ వేతనం 1.1 లక్షలు అందుకుంటున్నారు. ఎమ్మెల్యేల విషయంలోనూ తెలంగాణ ఎమ్మెల్యేలకు అందరికంటే ఎక్కువ జీత భత్యాలు అందుతుండగా త్రిపురలో ఎమ్మెల్యేలు  అతి తక్కువ వేతనం అందుకుంటున్నారు. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకి అన్నీ కలిపి రూ. 4 లక్షల వరకు అందుతోంది. త్రిపురలో ఈ మొత్తం రూ. 36 వేలు మాత్రమే.   


వివిధ రాష్టాల ముఖ్యమంత్రుల జీతాలు ఇలా.. 


తెలంగాణ -  4,10,000


దిల్లీ - 3,90,000


ఉత్తర ప్రదేశ్ - 3,65,000


మహరాష్ట్ర - 3,40,000


ఆంధ్రప్రదేశ్ - 3,35,000 


గుజరాత్  - 3,21,000


హిమాచల్ ప్రదేశ్-  3,10,000


హర్యానా - 2,88,000


ఝార్ఖండ్ - 2,72,000


మధ్య ప్రదేశ్ - 2,55,000


ఛత్తీస్‌గఢ్ - 2,30,000


పంజాబ్  - 2,30,0000


గోవా - 2,20,000


బిహార్ - 2,15,000


పశ్చిమ బెంగాల్ - 2,10,000


తమిళనాడు -  2,05,000


కర్నాటక - 2,00,000


సిక్కిం - 1,90,000


కేరళ - 1,85,000


రాజస్థాన్ - 1,75,000


ఉత్తరాఖండ్ - 1,75,000


ఒడిశా - 1,60,000


మేఘాలయ - 1,50,000


అరుణాచల్  ప్రదేశ్- 1,33,000


అస్సాం - 1,25,000


మణిపూర్ - 1,20,000


నాగాలాండ్ - 1,10,000


త్రిపుర - 1,05,500