Amaravathi : ఎట్టకేలకు అమరావతిలో తొలి బిల్డింగ్ రెడీ అయింది. ఎంతవరకు కార్యకలాపాలు సాగిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా తాత్కాలిక రాజధానిలో భాగమే. దీనిపైన కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక  గత అనుభవాల దృష్ట్యా రాజధాని పనులను వేగవంతం చేసింది. అందులో భాగంగా అమరావతిలో మొట్టమొదటి శాశ్వత కార్యాలయం రెడీ అయింది. అమరావతి పనులను సమీక్షించే CRDA కార్యాలయ భవనంగా సీడ్ యాక్సీస్ రోడ్ లో రాయపూడి వద్ద CRDA బిల్డింగ్ ని గ్రాండ్ గా కట్టారు

Continues below advertisement

బిల్డింగ్ విశేషాలు ఇవే

ఈ CRDA బిల్డింగ్‌ని G+7 మోడల్లో కట్టారు. బిల్డింగ్ ని బయటి నుంచి చూసే వాళ్లకు అమరావతి ని గుర్తు చేసేలా "A" అనే అక్షరం కనిపించేలా డిజైన్ చేశారు.దీనిలో మొదటి అంతస్తులో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇక్కడి నుంచే అమరావతి రాజధాని పనుల సమీక్ష, పొల్యూషన్ కంట్రోల్, వర్షపు నీటిని పంప్ చేయడం వంటి పనులను సూపర్వైజ్ చేస్తుంటారు. రెండు మూడు నాలుగు అంతస్తులను CRDA సిబ్బంది, అధికారులు వాడుకుంటారు.

Continues below advertisement

5,6 అంతస్తులను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్  (ADC) తన కార్యాలయంగా వాడుకోబోతుంది. అమరావతిలో ఎలాంటి సంస్థలు రావాలి, రాజధాని అభివృద్ధి వంటి అంశాలను ఈ సంస్థ మానిటరింగ్ చేస్తుంది. ఇక ఏడో అంతస్తులో మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం ఆ శాఖకు మంత్రి నారాయణ. పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనులు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి  ఆయన కార్యాలయం కూడా CRDA బిల్డింగ్ లోనే ఉండాలని ముఖ్యమంత్రి సూచించడంతో తన ఆఫీసు కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఈ బిల్డింగ్ టెర్రస్ పై  ఉద్యోగుల కోసం జిమ్, కేఫ్ వంటి  ఏర్పాట్లు చేసారు.  

అధునాతన సౌకర్యాలతో CRDA బిల్డింగ్ నిర్మాణం 

అమరావతి రాజధానిలో మొట్టమొదటి బిల్డింగ్ గా నిలిచిపోయే  CRDA భవంతిని వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా మోడరన్ గా ఉండే రిసెప్షన్, బిల్డింగ్ పైకి వెళ్లడానికి  ఐదు లిఫ్టులు, ఫైర్ ఎగ్జిట్, వృత్తాకారంలో ఉండే స్టెప్స్, సెంట్రలైజ్డ్ ఏసి, ఎటు చూసినా అద్భుతంగా వెలుగుతూ ఉండే లైట్స్  లాంటి ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి.

 6 ఎకరాలు... 160 కోట్లు..! 

నిజానికి ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం 2014-19 కాలంలోనే అప్పటి కూటమి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసింది. కానీ మధ్యలో ప్రభుత్వం మారడం, అమరావతి పనులు వెనక పడడం  వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూటమి మళ్ళీ అధికారం లోకి రావడంతో  బిల్డింగ్ నిర్మాణాన్నీ వేగంగా పూర్తి చేశారు. దీనికోసం 6 ఎకరాలు కేటాయించగా దానిలో 3.62 ఎకరాల్లో బిల్డింగ్ ఉండబోతోంది. మిగిలిన 2.51 ఎకరాల్లో పార్కింగ్, గ్రీనరీ ఏర్పాట్లు చేశారు. బిల్డింగ్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచినప్పుడు 160 కోట్లతో కేపీసీ సంస్థ ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. 

ఓపెనింగ్ ఎప్పుడంటే....! 

నిజానికి ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం  ఎప్పడో జరిగిపోయి ఉండాల్సింది. అయితే వర్షాల కారణంగా బ్యూటిఫికేషన్ పనులు లేట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి  అక్టోబర్ 2న గాని లేదా అదే నెలలో మరో తేదీని గాని తేదీన గానీ CRDA బిల్డింగ్ ని ప్రారంభించబోతుంది కూటమి ప్రభుత్వం.