YSRCP On Jagan Chiranjeevi Issue:  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను కలిసిన టైంలో జరిగిన పరిణామాలు నాడు ఎంత హాట్‌ టాపిక్ అయ్యాయో నేడు అదే స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మీటింగ్‌కు సంబంధించిన ఫుటేజ్‌ నాటి ప్రభుత్వం విడుదల చేసింది. కానీ అందులో చిరంజీవి లాంటి పెద్ద మనిషి ప్రాధేయపడుతూ అడుగుతున్న విజువల్స్‌, జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకుండా దృశ్యాలు ఉన్నాయి. దీన్ని చూసిన వారంతా రగిలిపోయారు. మెగా అభిమానులు, జనసైనికులు, జగన్‌ను వ్యతిరేకించే వారంతా ఆ చర్యను ఖండించారు. నాడు మొదలైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. 

Continues below advertisement

గురవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రస్తావించారు. నాడు ఇండస్ట్రీ పెద్దలను అవమానించారని గుర్తు చేశారు. అసలు గేటు నుంచి లోనికి రానివ్వకపోవడం, లోపలికి వెళ్లాక కూడా సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి వెళ్లాలని చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కలవబోరని అనేసరికి చిరంజీవి గట్టిగా నిలదీశారని తెలిపారు. గట్టిగా చిరంజీవి నిలదీశారనే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుపట్టారు. ఎవరూ అక్కడ గట్టిగా అడగలేదని అన్నారు. అంటే అక్కడ జరిగిన అవమానానికి వారు చెప్పిన దానికి సైలెంట్‌గా ఉండిపోయారే తప్ప మరో మాట మాట్లాడలేదని బాలయ్య అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. 

Continues below advertisement

అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించడం ఈ సందర్భంగా బాలయ్య వాడిన పదజాలంపై చిరంజీవి నొచ్చుకున్నారు. నాడు మేం గట్టిగా అగడటం వల్లే నాడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. నాడు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. ఓ లేఖనే విడుదల చేశారు. ఈ లేఖ నాడు ఏం జరిగిందో చెప్పారే తప్ప తమకు అవమానం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వైసీపీ మద్ధతుదారులు జగన్‌ అవమానించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా కూడా ఇదే చెబుతోంది. కానీ బాలకృష్ణ మాటలకు కౌంటర్‌గా లేఖలను విడుదల చేశారు కానీ జగన్‌ ప్రవర్తించిన తీరును ఎక్కడా ప్రస్తావించలేదు. నాడు తాడేపల్లిలో జరిగిన విషయంపై ఇప్పటికే చాలా సార్లు పవన్, చంద్రబాబు, బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం కూడా ఓ ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అప్పుడు కూడా చిరంజీవి స్పందించేలేదు. 

నాడు జరిగిందని చిరంజీవి మనసులో ఉంది. దానిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇకపై స్పందిస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఆయన గురువారం విడుదల చేసిన లేఖలో మాత్రం బాలకృష్ణ అన్న మాటలపై నొచ్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ, దాని అనుకూల  మీడియా భావిస్తోంది. అందుకే జగన్‌పై వస్తున్న ఆరోపణలు చిరంజవి కొట్టి పారేశారనే ప్రచారం చేస్తోంది. అదే టైంలో జగన్‌ను సైకో అన్న పదాన్ని కూడా ఖండిస్తోంది. అసలైన మానసిక రోగి బాలకృష్ణే అంటూ ఘాటుగా స్పందిస్తోంది. ఏమైనా సమస్య ఉంటే బావతో, పపన్ కల్యాణ్‌తో తేల్చుకోవాలే తప్ప తమ జోలికి రావద్దని హెచ్చరిస్తోంది.