Minister Peddireddy : 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాకుళం అమలుచేసిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తామన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఇచ్చామని, త్వరలో మరో 77 వేల కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. విద్యుత్ రాయితీని రైతుల ఖాతాల్లోనే జమచేస్తామని మంత్రి చెప్తున్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు.
చేతులు నరకాలని అనడం దారుణం
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తే రైతులు నష్టపోయేది ఏంలేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్లతో 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపుల్లో ఆదా అవుతుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, అక్కడ విజయవంతం అయిందన్నారు. స్మార్ట్ మీటర్లపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు శ్రీకాకుళం జిల్లాలో ఒకసారి పర్యటించాలని సూచించారు. స్మార్ట్ మీటర్లపై టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు లేనిపోని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారన్నారు.
30 శాతం ఆదా
"2023 మార్చి నాటికి వందశాతం వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే వేస్తున్నాం. ఇప్పటికే 70 శాతం మంది రైతులు బ్యాంకు ఖాతాలను తెరిచారు. స్మార్ట్ మీటర్లతో రైతులు నష్టపోయేది ఏంలేదన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోంది." -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విద్యుత్ రాజకీయం
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు కోరింది. విద్యుత్ సబ్సిడీలను ఆదా చేసేందుకు స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయని చెబుతోంది. స్మార్ట్ మీటర్లను బిగించేందుకు ఒప్పుకున్న రాష్ట్రాలకు కేంద్రం పోత్సాహకాలు కూడా అందిస్తోంది. అయితే తెలంగాణ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతారని సమయం దొరికినప్పుడల్లా సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయానికి జై కొట్టిన ఏపీ ప్రభుత్వం.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చుతోంది. ఇప్పటికే 41 వేల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించారు. వచ్చే ఏడాదికి వంద శాతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గి రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శలు చేస్తున్నారు.
Also Read : Harish Rao : ఏపీ సర్కార్‌పై సెటైర్లు ఆపని హరీష్ రావు - ఈ సారి అన్నీ కలిపి ..