Polavaram Meeting :  పోలవరం ప్రాజెక్ట్ ముంపు ఉండే రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు వర్చువల్‌గా సమావేశం నిర్వహంచారు.పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ ప్ర‌భావంపై థ‌ర్డ్ పార్టీ స్ట‌డీ చేయించాల్సిందేన‌ని రాష్ట్ర సాగునీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.  తెలంగాణ‌, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి పారుద‌ల శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ముంపు సమస్యలపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది . ప్రాజెక్టు నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయని, ఆ మేరకు ముంపు సమస్య కూడా తీవ్రం కానుందని  తెలంగాణ ప్రతినిది రజత్ కుమార్ స్పష్టం చేశారు.  అంచనాకు మించి ముంపు వాటిల్లనుందని గణాంకాలతో సహా వివరించారు. చారిత్రక ప్రదేశాలు, పవర్ ప్లాంట్ ముంపున‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.


గోదావరి వరదలు వచ్చినప్పుు కాళేశ్వరం పోలవరం వల్లే మునిగిందన్న తెలంగాణ సర్కార్


ఇటీవల గోదావరికి వరదలు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం పంపులు మునగిపోవడానికి పోలవరం కారణం అని వాదించింది. ఈ విషయం వివాదం అయింది. ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా అదే వాదన వినిపించింది   సమావేశంలో పాల్గొన్న ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సైతం అదే వాదనలను వినిపించాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేప్పట్టలేదని అభ్యంతరం వ్యక్తం చేశాయి.  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని పట్టబట్టాయి. అదే విధంగా ముంపు నివారణకు రక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశారు. 


సుప్రీంకోర్టు ఆదేశాలతో ముంపు ప్రభావం ఉన్న  రాష్ట్రాలతో సమావేశం


అన్ని రాష్ట్రాల వాదనలు విన్న తరువాత మరోసారి వచ్చేనెల 7న సమావేశన్ని నిర్వహించాలని జల్ శక్తిశాఖ నిర్ణయించింది. పొలవరం ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోని ప్రాంతాలకు ముంపు ఉంటుందని  తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కోర్టుకెళ్లాయి. ఆ ప్రాజెక్టుతో కొన్నిచోట్ల వరద ముంపు తలెత్తుతుందని పేర్కొనగా, మొదట్లో తెలిపిన ప్రకారం కాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్టును విస్తరించడంతో సమస్యలు మొదలయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతుల మేరకు నిర్మాణం జరిగిందో లేదో మరోసారి సమీక్షించాలని ధర్మాసనాన్ని ఈ మూడు రాష్ట్రాలు కోరాయి. భాగస్వామ్య పక్షాలన్నింటితో కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ గత సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు.


నవంబర్‌లో మరోసారి భేటీ 


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాజా సమావేశం జరిగింది  అయితే ఇది ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు కాదని, కేంద్రం నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అని ఏపీ వాదిస్తోంది.  ఇది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి.. ఇందులో ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ఇతర రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేయ్నారు.  ప్రాజెక్టుకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యావరణ అనుమతుల సమస్యనూ పరిష్కరించాలని కోరుతోంది. తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.