CM Jagan Review : ఇళ్ల నిర్మాణంపై సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో స‌మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై  అధికారులతో సమగ్రంగా విశ్లేషించారు. గత సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు తీరును కూడా ఈ సంద‌ర్భంగా అదికారులు వివ‌రించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 4,318 కోట్ల విలువైన పనులు చేశామని అధికారులు వెల్లడించారు. తొలి విడతలో రూ15.6 లక్షలు, రెండో విడతలో రూ.5.65 లక్షలు మొత్తంగా రూ.21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గగానే ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుందని అధికారులు తెలిపారు. ఆప్షన్‌ –3  (ప్రభుత్వమే కట్టించి ఇచ్చే) ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివ‌రించారు. 


మౌలిక సౌకర్యాల కల్పనపై 


ప్రతివారం నిర్మాణ సంస్థలతో సమీక్ష చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామ‌ని, ఇళ్ల నిర్మాణంలో  నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో  ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలన్నారు. కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సీఎం తెలిపారు. కాలనీల పరంగా ప్రాధాన్యతా పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, పనులు చేపట్టాలని సీఎం అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు.


Also Read : CAG Report On AP: ఇక అప్పులు భరించే కెపాసిటీ ఏపీకి లేదు, మొత్తం రుణాలు ఎంతంటే - కాగ్ రిపోర్టులో కీలక విషయాలు


టిడ్కో ఇళ్లపై సీఎం జ‌గ‌న్ సమీక్ష 


ఇప్పటికే పనులు పూర్తైన వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నామని, అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. డిసెంబరు నాటికి ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు అవ‌స‌రం అయిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయ కల్పన, పనులు అత్యంత నాణ్యతతో చేపడుతున్నామని అధికారులు వివ‌రించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై  ప్రత్యేక దృష్టి పెట్టామని, అధికారులు సీఎంకు తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం, దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టాలు అందించే కార్యక్రమంపై దృష్టి సారించాల‌న్నారు. ఇప్పటికే 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాట్లు తెలిపారు. 


Also Read : Sajjala On Jagan : శాశ్వత అధ్యక్ష పదవిని జగనే తిరస్కరించారు - వివాదంపై సజ్జల క్లారిటీ !


Also Read : ఊహించని వేగంతో ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారెందుకు ? అసలు రాజకీయం వేరే !