Koffee With Karan 7: మా లైఫ్‌లో అవి అత్యంత దారుణమైన రోజులు, కలిసికట్టుగా నిలబడ్డాం - కాఫీ విత్ కరణ్‌లో గౌరీఖాన్

Koffee With Karan 7: కాఫీ విత్ కరణ్‌ షోలో గౌరీఖాన్, ఆర్యన్‌ ఖాన్ అరెస్ట్‌ గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు.

Continues below advertisement

Koffee With Karan 7: 

Continues below advertisement

కరణ్‌ జోహార్ ప్రశ్న..

కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌ ఎంత ఫేమస్ అయిందో..అంత కాంట్రవర్సీ కూడా అయింది. మధ్యలో కొన్నాళ్లు ఆపేసి...ఈ మధ్యే మళ్లీ మొదలు పెట్టారు. ఇటీవల ఈ షోకి షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ వచ్చారు. ఈ సమయంలోనే ఆర్యన్ ఖాన్ గురించి మాట్లాడారు. గతేడాది డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్ అయ్యాడు. ఎన్‌సీబీ ఆయనను అరెస్ట్ చేసింది. తరవాత క్లీన్ చిట్ వచ్చింది. దీన్ని తలుచుకుని బాధ పడ్డారు గౌరీ ఖాన్.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సమయంలో తమ కుటుంబం ఎంత మానసిక వేదన అనుభవించిందో వివరించారు. కరణ్ జోహార్ ఆర్యన్ పేరు ప్రస్తావించకుండానే ప్రశ్న అడిగాడు. దానికి గౌరీ ఖాన్ చాలా ఎమోషనల్‌గా సమాధానమిచ్చారు. "కేవలం ప్రొఫెషనల్‌గానే కాదు. వ్యక్తిగతంగానూ మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదా. కానీ...మీరు కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. మళ్లీ గట్టిగా నిలబడ్డారు. ఇదంత సులువు కాదని నాకు తెలుసు. మనమంతా ఓ కుటుంబం. నేను మీ పిల్లలకు దేవుడిచ్చిన తండ్రినని భావిస్తాను. కానీ మీరు ఈ సంక్షోభం నుంచి బయటపడటం చాలా గొప్ప విషయం. ఆ చేదు అనుభవాల గురించి మీరేం చెబుతారు?" అని కరణ్ జోహార్ గౌరీఖాన్‌ను ప్రశ్నించాడు. దీనికి గౌరీఖాన్ బదులిచ్చారు. 

ఇలా బదులిచ్చిన గౌరీఖాన్...

"అవును. మా జీవితంలో ఇంత దారుణమైన రోజుల్ని ఇప్పటి వరకూ చూడలేదు. ఓ తల్లిగా నేనెంత మానసిక వేదన అనుభవించానో తెలుసు. కానీ..ఇవాళ మేమం కలిసికట్టుగా ఓ కుటుంబంగా నిలబడ్డాం. మాపై అందరూ ప్రేమ చూపించారు" అని చెప్పారు గౌరీ ఖాన్. "నాకు తెలియని వాళ్ల నుంచి నాకెన్నో మెసేజ్‌లు వచ్చాయి. అలాంటి వాళ్లు దొరకటం మా అదృష్టం. కష్టకాలంలో మాకెంతగానో సహకరించారు" అని అన్నారు. సౌత్‌ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ఆర్యన్ ఖాన్. షారుక్ కూతురు సుహానా...త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. Archies మూవీతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.  

ఇదీ కేసు..

గతేడాది ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గతేడాది అక్టోబర్‌లో అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగి స్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉండటం అప్పట్లో సంచలనమైంది. 

 

 

Continues below advertisement