ప్రభుత్వరంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. డిసెంబరులోఆన్‌లైన్  ప్రిలిమినరీ పరీక్ష, వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరిలో ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి/మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. మార్చి చివరి నాటికి తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.


Also Read:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5008 క్లర్క్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?


 


పోస్టుల వివరాలు..


ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో): 1673 పోస్టులు


పోస్టుల కేటాయింపు: జనరల్-648, ఈడబ్ల్యూఎస్-160, ఓబీసీ-464, ఎస్సీ-270, ఎస్టీ-131.


అర్హత: ఏదైనా డిగ్రీ.


వయోపరిమితి: 01.04.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రిలిమినరీ (ఫేజ్-1), మెయిన్ (ఫేజ్-2) రాతపరీక్షలు, సైకోమెట్రిక్ టెస్ట్(ఫేజ్-3), గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


 


Also Read:  SSC CGL Notification: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!



పరీక్ష విధానం


ఫేజ్-1: ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ¼ వంతు మార్కులు కోత విధిస్తారు.



ఫేజ్-2: మెయిన్ పరీక్ష: మొత్తం 250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు-50 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు -40 మార్కులు, జనరల్ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. ఇక డిస్క్రిప్టివ్ పేపర్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ పశ్నలకు 50 మార్కులు ఉంటాయి.



ఫేజ్-3:  సైకోమెట్రిక్ టెస్ట్: అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.



తుది ఎంపిక ఇలా:


మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.



Also Read:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా



జీతభత్యాలు
: నెలకు రూ.41,960 (బేసిక్ పే).


తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్


తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు.



ముఖ్యమైన తేదీలు
..




  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2022




  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.10.2022.




  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.




  • దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 27.10.2022.




  • ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : 2022, డిసెంబర్ మొదటి/ రెండో వారంలో ప్రారంభం.




  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 2022, డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో.




  • ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: డిసెంబర్ 2022/ జనవరి 2023.




  • మెయిన్ ఎగ్జామ్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : జనవరి 2023/ ఫిబ్రవరి 2023.




  • మెయిన్ ఎగ్జామ్ తేది: జనవరి 2023/ ఫిబ్రవరి 2023.




  • మెయిన్ పరీక్ష ఫలితాలు: ఫిబ్రవరి 2023.




  • ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 2023.




  • ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి 2023.




  • గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి 2023.




  • తుది ఫలితాలు: మార్చి 2023.




 


Notifiaction


Online Application



Website


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...