CM Jagan Reveiw On Agriculture sector : మే 16న రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, పంట బీమా పరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోపు రైతులకు పంట బీమా పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మూడు వేల ట్రాక్టర్లు, 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికైనందుకు వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. 


మే 11న మత్స్యకార భరోసా 


మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోగా పంట బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతులకు పెట్టుబడి సాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జూన్‌ మొదటి వారంలోనే రైతులకు 3 వేల ట్రాక్టర్లతో కలిపి 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే మే 11న మత్స్యకార భరోసా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్బీకే, ఇ-క్రాపింగ్‌ చాలా ముఖ్యమైనవి అని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల కార్యకలాపాలు, ఇ– క్రాపింగ్‌ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సోషల్‌ ఆడిట్‌ కూడా సక్రమంగా నిర్వహించి రైతులకు పథకాలు అందించాలని సీఎం జగన్ అన్నారు. 


4 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు 


రైతులకు ఎక్కడ మద్దతు ధరలు లభించకపోయినా వెంటనే అధికారులు స్పందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతులను ఆదుకునే చర్యలను తీసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు. 2021 ఖరీఫ్‌లో 90.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు, రబీ 2021-22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు అయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 2020-21లో ఆహార ఉత్పత్తులు 165.07 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2021-22లో 171.7 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చినట్లు వెల్లిడించారు. గత ఏడాదితో పోలిస్తే ఆహార ఉత్పత్తులు 4 శాతం పెరిగినట్లు తెలిపారు. 


మూడో పంట సాగు 


రాష్ట్రంలో మూడో పంటకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో మూడోపంట సాగు చేసినట్లు వెల్లడించారు. ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 477శాతం మూడో పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం అయిందని అధికారులు తెలిపారు. ఈ కనెక్షన్లు దాదాపు 30 శాతం విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయిదని అధికారులు తెలిపారు. రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్‌ పేరుతో లెక్క కడుతున్నట్లు తెలిపారు. తర్వలో వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చాలని ఆదేశించారు. 


కిసాన్ డ్రోన్ల నిర్వహణ


కిసాన్‌ డ్రోన్లు, నిర్వహణ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ఆర్బీకేల పరిధిలో చదువుకుని పరిజ్ఞానం ఉన్న రైతులతో ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేసి, శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందించాలన్నారు. రైతులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక మాస్టర్‌ ట్రైనర్‌ ఏర్పాటుచేయాలన్నారు. డ్రోన్‌తో ఫెస్టిసైడ్స్‌, ఫెర్టిలైజర్స్‌ వేయొచ్చో వివరించేలా రూపొందించిన వీడియోలను రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం తెలిపారు.