Bandla Ganesh Vs Vijaysai Reddy : ఏఐసీసీ అBandla Ganesh Vs Vijaysai Reddy : రాహుల్ గాంధీ పర్యటన బండ్ల గణేష్, విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మరోసారి విజయసాయి రెడ్డి ట్వీట్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.
గ్రనేనత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన(Telangana Tour) ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. రాహుల్ తో భేటీ అయిన వ్యక్తులను విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijaysai Reddy) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సినీ నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. అలాగే నెటిజన్లు కూడా ఇరు వర్గాలుగా విడిపోయిన విమర్శలు చేసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీనటుడు బండ్ల గణేష్ మధ్య ఇటీవల ఒకసారి ట్వీట్ల వార్ జరిగింది. ఓ కులాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని బండ్ల గణేష్ చేసిన ట్వీట్(Tweet) పై విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది వ్యక్తిగతంగా మారింది. తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది.
బండ్ల గణేష్ కౌంటర్
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఎల్లో మీడియా(Yellow Media) ప్రముఖులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు బండ్ల గణేష్ స్పందించారు. రాహుల్ గాంధీని కలిసినవారందరూ ఎల్లో మీడియా వాళ్లేనా అంటూ బండ్ల గణేష్ చురకలంటించారు. ఆచార్య హరగోపాల్(Haragopal), గద్దర్(Gaddar), ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ ఆలీఖాన్‌లు కూడా రాహుల్‌ను కలిశారన్నారు. వాళ్లు కూడా ఎల్లో మీడియానేనా? అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. విజయసాయి ట్వీట్‌పై ఓ వర్గం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వైసీపీ బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకుందా అని విమర్శలు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్ పై విజయసాయి రెడ్డి ఇంకా స్పందించలేదు. ఆయన ఏం కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.
గతంలో ట్వీట్ల వార్
ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య ఇటీవల ట్వీట్ల వార్ నడిచింది. ఒకరి గురించి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ట్వీట్ వార్‌ను బండ్ల గణేష్ ప్రారంభించారు. విజయసాయి రెడ్డి ఓ కులాన్ని నిందిస్తున్నారని ఆరోపిస్తూ బండ్ల గణేష్ విమర్శలు చేశారు. తర్వాత విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. " వైజాగ్ ని కుదిపేసిన తుపాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావ్ సాయి" అంటూ విరుచుకుపడ్డారు. అంతే కాదు షర్మిల జగన్‌తో విభేదించడానికి కూడా కారణం విజయసాయి రెడ్డే అని మరో ట్వీట్ చేశారు. మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ వైసీపీని టార్గెట్ చేయలేదు. ఒక్క విజయసాయి రెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ను విజయసాయి రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
బండ్ల గణేష్ ట్వీట్లు విజయసాయి రెడ్డిని బాధపెట్టేయేమో ఆయన కూడా వెంటనే స్పందించారు. ఆయన ట్వీట్ల భాష గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ తెలుసుంటుంది. ఆయన ట్వీట్ల భాష దిగువ స్థాయిలో ఉంటుంది. బండ్ల గణేష్ పైనా అదే స్థాయిలో విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి స్పందిస్తే ఇక బండ్ల గణేష్ ఎందుకు ఊరుకుంటారా ఆయన వెంటనే స్పందించారు. ఒకటికి రెండు తిట్లతో ట్వీట్లు పెట్టుకున్నారు.