Today Top Headlines In AP And Telangana:
1. తిరుమల వెళ్లే వీఐపీ భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి మొదలవుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీడీ అధికారులు. టీటీడీ అడిషనల్ EO వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు, CVSO శ్రీధర్ ఏర్పాట్లు మొత్తం పరిశీలించారు. ఇంకా పెండింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అదే సమయంలో భక్తులు అనుసరించాల్సిన నియమాల గురించి స్పష్టత ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య 'జనవరి 10, 11, 12.. ఈ మూడు రోజుల్లో భారీగా ఉంటుంది. ఇంకా చదవండి.
2. వైసీపీ నేత సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా.?
ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అన్నీ తానై వ్యవహరించిన సజ్జలరామకృష్ణారెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకునేలా కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయం కేసులో ఆయన పేరు ఉందని తర్వాత కాదంబరి జత్వాని ఇలా వేర్వేరు కేసుల్లో ఆయన పేరు ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. అన్నీ సైలెంట్ అయ్యాయని అనుకుంటున్న టైంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండల రెవెన్యూ పరిధిలో సజ్జల కుటుంబానికి సాగుభూమి ఉంది. అందులో దాదాపు 50 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా చదవండి.
3. మండపేటలో రేవ్ పార్టీ కలకలం
న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు... సొషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్. మొన్న ఏలూరులో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్టినరోజు పేరున రేవ్ పార్టీ నిర్వహించడం దుమారం రేపింది. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నూతన సంవత్సర వేడుకల పేరిట రేవ్ పార్టీ చేయడం కలకలం రేపుతోంది. మహిళల చేత అశ్లీలంగా నృత్యాలు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా భారీ లైటింగు డిజె సౌండ్లు పెట్టుకుని ఓ లేఔట్ లో చేసిన నృత్యాల వీడియోలు ఇప్పడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంకా చదవండి.
4. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నా.. ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇంకా చదవండి.
5. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి 3 రోజుల సెలవులు
తెలంగాణలో సంచలనంగా మారిన సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌లో వీడియోల చిత్రీకరణ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో దొరికిన ఫింగర్ ప్రింట్స్, అనుమానితుల వేలి ముద్రలను మ్యాచ్ చేస్తూ ఎంక్వయిరీ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ హాస్టల్ నెలకొన్న వివాదం ఎంత సంచలనంగా మారిందో చెప్పనవసరం లేదు. జనవరి 1 రాత్రి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చదవండి.