Akhil Akkinenis Lenin Movie | అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ తరువాత నెక్స్ట్ మూవీ కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న అఖిల్ (Actor Akhil) కొత్త మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీలో అఖిల్ కు విలన్ గా ఓ ప్రముఖ బాలీవుడ్ (Bollywood) స్టార్ కన్పించబోతున్నారనే సమాచారం బయటకు వచ్చింది. 


ఏడాదిన్నర తరువాత రీఎంట్రీ  
'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత, అఖిల్ అక్కినేని ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నాడు. దీంతో ఆయనను తెరపై అక్కినేని అభిమానులు ఎంతగానో మిస్ అయ్యారు. ఎట్టకేలకు ఆయన తన నెక్స్ట్ మూవీకి సంతకం చేసాడనే వార్తతో అఖిల్ అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గతంలో కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ఎమోషనల్ లవ్ స్టోరీతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీలో మెయిన్ విలన్ కోసం వేట కొనసాగుతోంది.


'లెనిన్'కు విలన్ గా బాలీవుడ్ స్టార్
ప్రస్తుతం తెలుగు సినిమాలలో బాలీవుడ్ నటులు విలన్లుగా నటిస్తున్న ట్రెండ్ జోరుగా సాగుతోంది. అదే ట్రెండ్ ను ఇప్పుడు అఖిల్ అక్కినేని కొత్త మూవీ 'లెనిన్' కోసం ఫాలో అవ్వబోతున్నారు మేకర్స్. '1992 స్కామ్' ఫేమ్ ప్రతీక్ గాంధీని 'లెనిన్'లో మెయిన్ విలన్ పాత్ర కోసం మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్ విన్పిస్తోంది. ఈ మేరకు 'లెనిన్' మేకర్స్ ప్రతీక్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రతీక్ వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన డేట్స్ ఇచ్చినా కూడా 'లెనిన్' షూటింగ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే గనక జరిగితే ప్రతీక్ ను పక్కన పెట్టి తమిళ నటుడు విక్రాంత్ ను విలన్ గా టీమ్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఈ విషయంపై 'లెనిన్' నిర్మాతలు ఫైనల్ డెసిషన్ తీసుకొనున్నారని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. 



నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన అఖిల్  
అఖిల్ ప్రస్తుతం చేస్తున్న 'లెనిన్' సినిమాను కాకుండా, మరో పీరియాడిక్ సినిమా కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన బడా ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్‌తో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. నిజానికి యూవీ క్రియేషన్స్ తోనే అఖిల ముందుగా మూవీ చేయాల్సి ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు 'లెనిన్‌'పై దృష్టి సారించాడు అఖిల్.



Also Read: 'గేమ్ చేంజర్' ట్రైలర్‌ వచ్చిందోచ్... ఇదీ ఫ్యాన్స్‌కు కావాల్సిన బ్లాస్ట్ - మెగా మాస్ అంతే