Movies to Watch During Pongal 2025 | అతి త్వరలోనే సంక్రాంతి సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి పలు తెలుగు ఓటీటీ (OTT Movies) ప్లాట్ఫామ్స్. ఓవైపు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద సినిమాల జాతర ఉంటే, మరోవైపు ఓటీటీలో పలు డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాల హడావిడి ఉండబోతోంది. అందులో భాగంగా తాజాగా ఈటీవీ విన్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ "ఈ పొంగల్ ను పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ తో సెలబ్రేట్ చేసుకుందాం" అంటూ కొన్ని ఎక్సైటింగ్ సినిమాల రిలీజ్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ జనవరిలో నాలుగు సినిమాలను రిలీజ్ చేయబోతున్నామంటూ పోస్టర్లతో సర్ప్రైజ్ ఇచ్చింది ఈటీవీ విన్.
పోతుగడ్డ
పృథ్వి దండముడి, ఆడుకలం నరేన్, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పోతుగడ్డ'. చాలా రోజుల క్రితమే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ మూవీ నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ఇంతకు ముందు ప్రకటించారు. కానీ తాజాగా ఈటీవీ విన్ వదిలిన పోస్టర్ ప్రకారం పొంగల్ కానుకగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఓ ప్రేమ జంట, వాళ్ల చుట్టూ తిరిగే రాజకీయాలతో ఈ మూవీ ఆసక్తికరంగా ఉండబోతోంది.
బ్రేక్ అవుట్
టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'బ్రేక్ అవుట్'. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో గౌతమ్ ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీ 2016లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ 'ట్రాప్డ్' నుంచి స్ఫూర్తి పొందినట్టుగా టాక్ నడుస్తోంది. ఒంటరిగా ఉండాలంటే భయంతో బాధపడే ఓ యువకుడు, సిటీకి దూరంగా ఉండే ఓ మెకానిక్ షెడ్ లో చిక్కుకుపోతాడు. అక్కడ నుంచి బయట పడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? అనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయగా, అందులో గౌతమ్ మాత్రమే కనిపించాడు. ఈ మూవీకి సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించగా, అనిల్ మోదుగ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను పొంగల్ కానుకగా ఈటీవీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
మిన్మినీ
'మిన్మినీ' అనేది ఒక తమిళ సినిమా. హర్షిత షమీమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రవీణ్ కిషోర్, ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమా 2024 ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ డ్రామాను ఈటీవీలో పొంగల్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
వైఫ్ ఆఫ్
ఈ ఏడాది పొంగల్ సందర్భంగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలలో 'వైఫ్ ఆఫ్' కూడా ఒకటి. దివ్యశ్రీ, అభినవ్ మణికంఠ, నిఖిల్ గాజుల, సాయి శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను రాహుల్ తమడ, సందీప్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ నాలుగు సినిమాలను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ ఇంకా డేట్స్ ఇవ్వలేదు ఈటీవీ విన్.
Read Also : Mahesh Babu: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?