January Watchlist on Hot star: ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ల షెడ్యూల్ ను వాచ్ లిస్ట్ పేరుతో, డేట్ వైజ్ రివీల్ చేసింది. సోషల్ మీడియా వేదికగా జనవరిలో తమ ఓటీటీలో ఏ రోజు ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాన్ని ఈ లిస్ట్ ద్వారా తాజాగా బయట పెట్టింది. కొత్త ఏడాది మొదటి నెల మొదటి నుంచి, ఎండింగ్ వరకు డిస్ని ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ లు, అలాగే స్పోర్ట్స్ కు సంబంధించిన రిలీజ్ డేట్ లతో పాటు ఈ మేరకు ఒక పోస్టర్ ను వదిలింది డిస్ని ప్లస్ హాట్ స్టార్. దీంతో ప్రేక్షకులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ నెలలో హాట్ స్టార్ లో ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాన్ని ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఈ పోస్టర్ ప్రకారం జనవరి 3 నుంచి మొదలు పెడితే, జనవరి 31 వరకు స్ట్రీమింగ్ కాబోతున్న షోస్ లిస్ట్ ఇచ్చారు.
జనవరి 3న - ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్
జనవరి 3న - గుణ సీజన్ 2
జనవరి 5న - బ్లింక్
జనవరి 10న - గూస్ బంప్స్ ది : వ్యానిషింగ్ (హార్రర్ సిరీస్)
జనవరి 12న - ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ (స్పోర్ట్స్)
జనవరి 16న - ది ట్రూత్ అన్ మాస్క్డ్
జనవరి 15న - రియల్ బగ్స్ లైఫ్
జనవరి 16న - చెల్సియా వర్సెస్ బార్న్ మౌత్
జనవరి 17న - రాయ్ వుడ్ జూనియర్ లోన్లీ ఫ్లవర్స్
జనవరి 18న - యు19 ఐసీసీ ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ (స్పోర్ట్స్)
జనవరి 22న - ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా మెన్స్ (స్పోర్ట్స్)
జనవరి 25న - మ్యాన్ సిటీ స్టర్ వర్సెస్ చెల్సియా (స్పోర్ట్స్)
జనవరి 26న - టొట్టెనం హాట్స్పర్ వర్సెస్ లీసెస్ట్రర్ (స్పోర్ట్స్)
జనవరి 27న - ఫుల్హం వర్సెస్ మాన్ యుటిడి (స్పోర్ట్స్)
జనవరి 29న - యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మాన్
జనవరి 31న - హాట్ స్టార్ స్పెషల్స్ 'ది సీక్రెట్ ఆఫ్ ది షీల్డర్స్'
ఇప్పుడు - ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రీమియర్ లీగ్
తెలుగు ప్రేక్షకులకు తప్పని నిరాశ
ఇలా నెల మొదటి నుంచి చివరిదాకా తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ఒకే పోస్టర్ లో ఇచ్చేసింది హాట్ స్టార్. అయితే ఇందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం ప్రేక్షకులకు నిరాశను కలిగించే విషయమని చెప్పాలి. అయితే 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' మాత్రం తెలుగులో కూడా స్ట్రిమింగ్ కాబోతోంది. మరి ఈ లిస్టులో ఏమైనా సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఉందా లేదా? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే ఉన్న వారు ఏ రోజు ఏ సినిమా కాబోతుందో తెలియాలంటే, ఈ జనవరి వాచ్ లిస్ట్ ను సేవ్ చేసి పెట్టుకుంటే సరి.