Tirumala Vaikunta Dwara Darshan 2025:  తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు  జనవరి 10 నుంచి మొదలవుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీడీ అధికారులు. టీటీడీ అడిషనల్ EO వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు, CVSO శ్రీధర్ ఏర్పాట్లు మొత్తం పరిశీలించారు. ఇంకా పెండింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అదే సమయంలో భక్తులు అనుసరించాల్సిన నియమాల గురించి స్పష్టత  ఇచ్చారు.  


Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!
 
వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య 'జ‌న‌వ‌రి 10, 11, 12..ఈ మూడు రోజుల్లో భారీగా ఉంటుంది


దర్శనానికి వచ్చే VIP లకు వారికి ఇచ్చిన పాసులలో దర్శన సమయం, పార్కింగ్ ప్రదేశాలు, ఎంట్రీ - ఎగ్జిట్ గేట్ల వివరాలు మొత్తం ఉంటాయి. అందులో పొందుపరిచిన సమయానికి మాత్రమే వీఐపీలు దర్శనానికి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఈ నియమం పాటించకపోతే సాధారణ భక్తులు ఇబ్బందిపడతారని చెప్పారు.  


రాంబగిచా ప్రాంతంలో ఉండే వాహనాల పార్కింగ్ ను బయటకు మార్చారు...ఇందుకు బదులుగా బగ్గీలు, అద‌న‌పు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. 


వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు తమ పాదరక్షలను రూమ్స్ లో అయినా, వారి వాహనాల్లో అయినా వదిలి రావడం మంచిది


తోటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య నియమాలు పాటించాలని టీటీడీ అధికారులు సూచించారు


తిరుమలలో ట్రాఫిక్ ను సక్రమంగా నిర్వహించేందుకు , SSD కౌంటర్ల వద్ద , ఫుట్ పాత్ మార్గంలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు


ప‌ర‌కామ‌ణి భ‌వ‌నం సమీపంలో ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీ‌వారి సేవాస‌ద‌న్ ముందు, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం స‌మీపంలో పార్కింగ్ ప్రదేశాలను టీటీడీ అధికారులు పరిశీలించారు


శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టోకెన్లను తిరుమల, తిరుపతిలో జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కౌంటర్ల వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!


శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం


శ్రీకళ్యాణగుణోల్లాసం చిద్విలాసం మహౌజసమ్ |
శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే ||  


వారాహవేషభూలోకం లక్ష్మీమోహనవిగ్రహమ్ |
వేదాంతగోచరం దేవం వేంకటేశం భజామహే ||  


సాంగానామర్చితాకారం ప్రసన్నముఖపంకజమ్ |
విశ్వవిశ్వంభరాధీశం వృషాద్రీశం భజామహే || 


కనత్కనకవేలాఢ్యం కరుణావరుణాలయమ్ |
శ్రీవాసుదేవ చిన్మూర్తిం శేషాద్రీశం భజామహే ||  


ఘనాఘనం శేషాద్రిశిఖరానందమందిరమ్ |
శ్రితచాతక సంరక్షం సింహాద్రీశం భజామహే ||  


మంగళప్రదం పద్మాక్షం కస్తూరీతిలకోజ్జ్వలమ్ |
తులస్యాది మనఃపూజ్యం తీర్థాద్రీశం భజామహే ||  


స్వామిపుష్కరిణీతీర్థవాసం వ్యాసాదివర్ణితమ్ |
స్వాంఘ్రీసూచితహస్తాబ్జం సత్యరూపం భజామహే ||  


శ్రీమన్నారాయణం శ్రీశం బ్రహ్మాండాసనతత్పరమ్ |
బ్రహ్మణ్యం సచ్చిదానందం మోహాతీతం భజామహే ||  


అంజనాద్రీశ్వరం లోకరంజనం మునిరంజనమ్ |
భక్తార్తిభంజనం భక్తపారిజాతం తమాశ్రయే ||  


భిల్లీ మనోహర్యం సత్యమనంతం జగతాం విభుమ్ |
నారాయణాచలపతిం సత్యానందం తమాశ్రయే ||  


చతుర్ముఖత్ర్యంబకాఢ్యం సన్నుతార్య కదంబకమ్ |
బ్రహ్మప్రముఖనిత్రానం ప్రధానపురుషాశ్రయే ||  


శ్రీమత్పద్మాసనాగ్రస్థ చింతితార్థప్రదాయకమ్ |
లోకైకనాయకం శ్రీమద్వేంకటాద్రీశమాశ్రయే ||  


వేంకటాద్రిహరేః స్తోత్రం ద్వాదశశ్లోకసంయుతమ్ |
యః పఠేత్ సతతం భక్త్యా తస్య ముక్తిః కరేస్థితా ||  


సర్వపాపహరం ప్రాహుః వేంకటేశస్తదోచ్యతే |
త్వన్నామకో వేంకటాద్రిః స్మరతో వేంకటేశ్వరః |
సద్యః సంస్మరణాదేవ మోక్షసామ్రాజ్యమాప్నుయాత్ ||  


వేంకటేశపదద్వంద్యం స్మరామి వ్రజామి సదా |
భూయాః శరణ్యో మే సాక్షాద్దేవేశో భక్తవత్సలః ||  


ఇతి శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రమ్ |


Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!