Today Top Headlines In AP And Telangana:
1. అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించాలని, గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ చిట్ చాట్ లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు, వాళ్ల టీమ్ అయినా వెంటనే మృతిచెందిన వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శిస్తే సరిపోయేదన్నారు. మానవతా ధృక్పథం లోపించినట్లు కనిపిస్తుందననారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి కాబట్టే హీరో అయిన అల్లు అర్జెన్‌ను అరెస్టు చేయగలిగారు. ఇంకా చదవండి.
2. టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డు
అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ రికార్డు నమోదు చేసింది. టీడీపీ (TDP) సభ్యత్వ నమోదులో మంగళగిరి చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో మంగళగిరి నియోజకరవర్గంలో సభ్యత్వ నమోదు లక్ష మార్క్ దాటింది. నియోజకవర్గ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ శాశ్వత సభ్యత్వాలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అఖండ విజయం సాధించిన తరువాత టీడీపీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టింది. ఇంకా చదవండి.
3. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
సిక్కోలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తమ్మినేని టచ్‌లోకి వెళ్లారం జరిగింది. అందుకే ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని వైసీపీ (YSRCP) శ్రేణులు భావించాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఇంటికి శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలే ఒక్కో కీలక నేత పార్టీని వీడుతుండటం అధినేత జగన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంకా చదవండి.
4. బన్నీ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నేడు అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, బెయిల్ పై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జనవరి 3కు తీర్పు వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించగా పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అదేరోజు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం తెలిసిందే. దాంతో రెగ్యూలర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఇంకా చదవండి.
5. సీఎం రేవంత్ తీర్మానానికి కేటీఆర్ పూర్తి మద్దతు
తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసనసభ సంతాపం తెలిపింది. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బలపరిచారు. ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని భట్టి కోరారు. ఇంకా చదవండి.