KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన

Telangana News | మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా సేవలు అందించారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆయన ప్రధానిగా ఉన్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.

Continues below advertisement

BRS leader KTR iin Assembly | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసనసభ సంతాపం తెలిపింది. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బలపరిచారు. ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని భట్టి కోరారు. 

Continues below advertisement

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మన్మోహన్ లాంటి గొప్ప ఆర్థికవేత్త, మానవతావాదికి భారతరత్న ఇవ్వాలన్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. మన్మోహన్ సింగ్ గొప్పతనం, ఆయన సామర్థ్యాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కేటీఆర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయిందన్నారు. గొప్ప ఆలోచనలు ఉన్నవారిని అరుదైన సందర్భం వస్తే ప్రపంచలో ఏ శక్తి ఆపలేదన్నారు.

 

తొలి బడ్జెట్ ప్రసంగంలోనే మన్మోహన్ సత్తా చాటారు

‘మాజీ ప్రధాని మన్మోహన్ గారికికి నివాళులు అర్పిస్తున్నాం, ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ తరఫున ప్రగాఢ సానుభూతి. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ని ప్రభుత్వం లోకి నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు. ఆర్బిఐలో పనిచేసిన మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా నియమించారు. భారతదేశం గురించి ప్రపంచం  వినాల్సి వస్తుందని తన తొలి బడ్జెట్ ప్రసంగంలో భారత దేశ స్థితిగతులను 1991 లో మన్మోహన్ సింగ్ చెప్పారు. అన్నట్లుగానే అనేక సంస్కరణలను సాధించింది భారతదేశం. 

నిబద్ధత అనేది రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. సింపుల్ లివింగ్- హై థింకింగ్ అనే జీవన విధానానికి పర్యాయపదం మన్మోహన్ సింగ్. తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు సేవ చేశారు. అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచారు, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్.. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. శాఖల కేటాయింపులు వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ తన షిప్పింగ్ శాఖను డిఏంకె పార్టీకి వదులుకున్నారు. తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంటూ కేసీఆర్ స్వయంగా మన్మోహన్ గారికి చెప్పారు. తెలంగాణ కోసం ఆరోజు ఇచ్చిన ఈ పోర్ట్ఫోలియో తెలంగాణ కోసం కేసీఆర్ ను ఒక ఖర్మయోగిగా మారుస్తుందని మన్మోహన్ అన్నారు.  

ఆనాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్

తెలంగాణ కల సాకరమయ్యే రోజు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. డిసెంబర్ 18, 2004లో ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ నుంచి ఒక ముఖ్యమైన డెలిగేషన్ తీసుకొస్తున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి ఓబీసీల డెలిగేషన్ తీసుకువస్తున్నామని చెప్పారు. కేవలం ఐ5 నిమిషాలు కాదు మరింత సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరితే మన్మోహన్ అంగీకరించారు. ఓబీసీల సమస్యల పైన కెసిఆర్, ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం ప్రతినిధి బృందానికి దాదాపు గంటన్నర పాటు అన్ని అంశాలను తెలిపారు. 

ఢిల్లీలో పీవీకి మెమోరియల్ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్

మన్మోహన్ సింగ్ సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు. అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చారు. ఎన్ని నిందలు వేసిన సంస్కరణలను అద్భుతంగా తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు పార్టీ బృందం హాజరై నివాళులు అర్పించాం. మన్మోహన్ సింగ్ కి హైదరాబాదులో విగ్రహం ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సహకారం అందిస్తాం. మన్మోహన్ సింగ్‌ను రాజకీయాలకు తీసుకొచ్చిన పీవీ నరసింహారావుకు ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ప్రధానులందరికీ దేశ రాజధాని ఢిల్లీలో మెమోరియల్ ఉంది కానీ పివికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో పీవీకి మెమోరియల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.  మెమోరియల్ ఎర్పాటు కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేస్తే బాగుంటుంది. మన్మోహన్ గారికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాం’ అన్నారు కేటీఆర్.

Also Read: Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం

Continues below advertisement
Sponsored Links by Taboola