Botsa Satyanarayana visits Tammineni Sitarams house | శ్రీకాకుళం: సిక్కోలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తమ్మినేని టచ్‌లోకి వెళ్లారం జరిగింది. అందుకే ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని వైసీపీ (YSRCP) శ్రేణులు భావించాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఇంటికి శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలే ఒక్కో కీలక నేత పార్టీని వీడుతుండటం అధినేత జగన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇంఛార్జ్ మార్చడంతో తమ్మినేని అలక
ఆమదాలవలస నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు అనంతరం తమ్మినేని సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లారని.. పార్టీ మీద అలిగారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని.. త్వరలో ఆయన పార్టీ సైతం మారతారని ఊహాగానాలు ప్రచారం అవుతున్న క్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేనితో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భేటీ జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. తమ్మినేని ఇంటికి బొత్స సత్యనారాయణ వస్తున్నారని తెలియడంతో ఆముదాలవలస ప్రస్తుత ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా మాజీ స్పీకర్ నివాసానికి వెళ్లి కలిశారు.

ఆమదాలవలసలోని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లి పరామర్శించారు. తమ్మినేని కుమారుడుకి ఇటీవల మేజర్ సర్జరీ కావడంతో బొత్స, నియోజకవర్గ ఇంఛార్జ్, వైసీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాదాపు అరగంటకు పైగా తమ్మినేనితో ఎమ్మెల్సీ బొత్స, పార్టీ ఇంఛార్జ్ చర్చించారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సైతం వారు చర్చించినట్లు సమాచారం.
పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? తమ్మినేని సీతారాం
బొత్స సత్యనారాయణ, నియోజకవర్గ నేతలు తనతో భేటీ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పీక పోయినా ఎవరైనా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారన్న ప్రచారం లాంటిదే ఇప్పుడు జరిగింది. నేను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నానో కార్యకర్తలకు తెలుసు. నా కొడుకు ఆరోగ్యం బోగోలేదని హాస్పిటల్ లో చికిత్స చేపిస్తున్నాను. దాదాపు నెల 15 రోజులు ఆసుపత్రి పనుల్లో బిజీగా ఉన్నాను. కానీ ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడటం సరికాదు అని హితవు పలికారు.
వదంతులు పుట్టించేవారే క్లారిటీ ఇవ్వాలి - మాజీ మంత్రి బొత్స
తమ్మినేనిని పరామర్శించిన అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల సర్జరీ కావడంతో తమ్మినేని నానిని చూసేందుకు వచ్చాం. దేవుడి దయవల్ల అతడు బాగున్నాడు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నా కాళ్లు మొక్కాడన్న వార్తలపై మాట్లాడను. ఆ వదంతులు ఎవరు పుట్టించారో, ఎవరైతే తేల్చుకోవాలో వారే దానిపై సమాధానం చెప్పుకుంటారు. నాకు సంబంధం లేని విషయం. అతనిపై ఎవరికి కోపం ఉందో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు.
Also Read: Year Ender 2024: శ్రీకాకుళంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ, వైసీపీకి కలిసిరాని 2024 ఎన్నికలు- కూటమిలో జోష్