Today Top Headlines In AP And Telangana:
1. వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన కుటుంబాన్ని ఏకం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారని ఈ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో చోటు చేసుకున్న పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.గత ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమికి కుటుంబం చీలిపోవడం కూడా ఓ కారణం. వివేకా హత్య కేసుతో పాటు సోదరి షర్మిలతో వచ్చిన ఆస్తుల తగాదాలతో కుటుంబం రెండుగా చీలిపోయింది. విజయమ్మ, షర్మిలపై ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేయడం ఇటీవలి కాలంలో బాగా వ్యతిరేక ప్రచారానికి కారణం అయింది. ఇంకా చదవండి.
2. ఎవరికీ తల వంచేదేలే అంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు లేక రాజకీయాల్లోకి వచ్చాం అనుకున్నారా, 1951లోనే మమ్మల్ని మద్రాసులో చదివించారు. మేం డబ్బులు లేనోళ్లం. అందుకే ఇప్పుడు సంపాదన మొదలుపెట్టాం’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. గత ఐదేళ్లు నియోజకవర్గ అబివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాను. గత ఐదేళ్లు చాలా నష్టపోయానన్న ప్రభాకర్ రెడ్డి... దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలపై జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి.
3. శ్రీవారి హుండీ విషయంలో సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీ ను దొంగతనం చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతను పెద్దజీయర్ మఠంలో పని చేసే వ్యక్తి. ఓ సారి నగదు తీసుకెళ్తూ దొరికిపోయాడు. కేసు పెట్టారు. అయితే ఈ కేసును లోక్ అదాలత్‌లో టీటీడీ అధికారులు పరిష్కరించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఓ పోలీసు అధికారి దగ్గరుండి ఈ సెటిల్మెంట్ చేశారని అంటున్నారు. ఇంకా చదవండి.
4. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్ నేడు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ గడువు సైతం పూర్తి కావడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కోసం అల్లు అర్జున్ తరఫున ఆయన లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు ఈ పిటిషన్ విచారణ స్వీకరించింది. ఇంకా చదవండి.
5. సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీపై పూనమ్ ఫైర్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే హీరోయిన్లలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఆమె చేసే ఇన్ డైరెక్ట్ ట్వీట్లు, కౌంటర్లు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ, పూనమ్ కౌర్ మాత్రం తన ట్వీట్ల దాడిని ఆపట్లేదు. సినిమాలలో అవకాశాలు లేకపోయినా ఇలా వివాదాస్పద ట్వీట్లతోనే ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తుంది. తాజాగా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ పెద్దలకు ఎక్స్ ద్వారా సూటి ప్రశ్న వేసింది. ఇంకా చదవండి.