Today Top Headlines In AP And Telangana:

1. అంబేడ్కర్ రగడపై స్పందించిన సీఎం చంద్రబాబు

గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా అమిత్‌షా వివాదం కుదిపేస్తోంది. అంబేడ్కర్‌ను ఆయన అవమానించి రాజ్యసభలో మాట్లాడారంటూ దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో ఎన్డీఏ మిత్ర పక్షాలను లాగేందుకు ఇండీ కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కీలకంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేశాయి. అందుకే మంత్రివర్గ సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. గురువారం మంత్రివర్గ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి అయన తర్వాత అంబేడ్కర్ అంశాన్ని చర్చకు పెట్టారు. అదే టైంలో పార్లమెంట్‌ అవరణంలో ఘర్షణ జరిగిందని కూడా తెలుసుకున్నారు. ఇంకా చదవండి.

2. ప.గో జిల్లాలో షాకింగ్ ఘటన

పశ్చిమగోదావరిజిల్లా ఉండి మండలంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆ డెడ్‌బాడి పార్శిల్‌లో రావడంతో అంతా భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్‌ పరికరాలు ఉన్నాయంటూ పార్శిల్ తెచ్చిన వ్యక్తి చెప్పాడు. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. ఇంకా చదవండి.

3. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

తెలంగాణ అసెంబ్లీని ఫార్ములా-ఈ కేసు షేక్ చేసింది. దీనిపై చర్చకు పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభలోనే నిరసన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. సభ ప్రారంభం నుంచే బీఆర్‌ఎస్ సభ్యులు ఫార్ములా ఈ రేస్‌ కేసుపై చర్చకు పట్టుబట్టారు. సభకు వస్తూనే కేసుపై నిరసన చేస్తూ వచ్చారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమమని నినాదాలు చేశారు. అందుకు నిరసనగాా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల తర్వాత భూభారతి బిల్లుపై చర్చను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ధరణి పోర్టల్‌ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీగా కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఇంకా చదవండి.

4. కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు

మాజీ మంత్రి కేటీఆర్‌పై  నమోదు అయిన ఫార్ములా ఇ కేసు చుట్టూ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇంత వరకు ఏసీబీ మాత్రం దీనిపై ఫోకస్డ్‌గా వర్క్ చేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇందులో 55 కోట్ల రూపాయల వ్యవహారం ఉన్నందున ఈడీ కూడా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కె.టిఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా చదవండి.

5. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ భారతీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధరణి అక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ చట్టం పేరుతో చేసిన కబ్జాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఫోరెన్సిక్‌ విచారణ చేస్తున్నట్టు సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇంకా చదవండి.